Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కీ .. చరణ్ కి ఉన్న తేడా అదొక్కటే!

By:  Tupaki Desk   |   19 March 2022 5:35 PM GMT
ఎన్టీఆర్ కీ .. చరణ్ కి ఉన్న తేడా అదొక్కటే!
X
'ఆర్ ఆర్ ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో వైభవంగా జరిగింది. వేలాదిమంది సినీ అభిమానులు ఈ వేడుకకి తరలివచ్చారు.

కర్ణాటక ముఖ్యమంత్రి .. ఆరోగ్యశాఖ మంత్రి .. శివరాజ్ కుమార్ ఈ ఫంక్షన్ కి విచ్చేశారు. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ, ముఖ్య అతిథులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ తరువాత ఆయన తన సినిమా హీరోలు అయిన ఎన్టీఆర్ .. చరణ్ గురించి తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. "నా రాముడు .. నా భీముడు. నేను అడిగిన వెంటనే ఏం చేస్తున్నాం? .. ఎలా చేస్తున్నాం? .. ఏం తీస్తున్నారు? అనే ప్రశ్నలు అడక్కుండా వాళ్ల శరీరంలోని ప్రతి అణువును సినిమా కోసం పెట్టిన రామ్ చరణ్ .. తారక్ లకు థ్యాంక్స్ చెబుతున్నాను.

చిరంజీవి ఎందుకు పెట్టారో తెలియదు .. రామ్ చరణ్ అని ఆంజనేయస్వామి పేరు పెట్టారు. నిజంగానే చరణ్ ఆంజనేయస్వామినే. తన బలం ఏమిటో తనకి తెలియదు. తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకి తెలియదు. ఆ ఫ్యాన్స్ తానంటే ఎంతగా పడి చచ్చిపోతారో ఆయనకి తెలియదు. చరణ్ నీకు ఇంతబలం ఉంది .. నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. ఆంజనేయస్వామికి తాను ఎంత గొప్పవాడనేది చెబితే వంద యోజనాల సముద్రాన్ని ఒక్క గెంతులో దాటాడు .. అలాంటివాడే చరణ్ .. మై బ్రదర్.

అలాగే నందమూరి హరికృష్ణగారు ఎందుకని తారకరామ్ అని పేరు పెట్టారో తెలియదుగానీ .. ఆయన సేమ్ రాముడి లెక్క. రాముడు సత్య వాక్య పరిపాలకుడు .. పితృవాక్య పరిపాలకుడు .. ఓన్లీ వన్ వైఫ్. ఇక్కడా అంతే .. ఓన్లీ ప్రణతి .. ఇంకేం లేదు. తన శక్తి ఏమిటో తనకి తెలిసిన మహనీయుడు రాముడు. అలా తన శక్తి ఏమిటో తనకి తెలిసిన యాక్టర్ ఎన్టీఆర్. తాను ఏం చేయగలడో తెలుసు .. ఎంతవరకూ చేయగలడో తెలుసు .. ఎలా మెప్పించగలడో తెలుసు. అలాంటి ఎన్టీఆర్ నా భీముడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చరణ్ గొప్ప నటుడు .. ఆ విషయం తనకి తెలియదు. ఎన్టీఆర్ గొప్ప నటుడు ఆ విషయం తనకి తెలుసు. ఇద్దరు గొప్పనటులు నా సినిమాలో చేయడం నాకు సూపర్ హ్యాపీ .. ఐయామ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్" అని చెప్పుకొచ్చారు.