Begin typing your search above and press return to search.
బాహుబలికి రామాయణంకు లింక్: రాజమౌళి
By: Tupaki Desk | 17 Jun 2023 9:27 AM GMTజక్కన్న రాజమౌళి బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్ లో అందరి దృష్టిని ఆకర్షించారు. దేశంలో ఎవ్వరికి సాధ్యం కాని 2000 కోట్ల రికార్డుని ఈ చిత్రంతో రాజమౌళి అందుకున్నారు. అందుకే జక్కన్న ఇండియాలో ప్రతి ఒక్కరు గర్వించదగ్గ దర్శకుడు అయ్యాడు. తాజాగా ఆదిపురుష్ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాలో రాముడి పాత్ర చిత్రణ నుంచి చాలా విషయాలపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే గతంలో రాజమౌళి బాహుబలి మూవీ ప్రమోషన్స్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాముడి పాత్ర ప్రతి ఒక్కరికి కనెక్ట్ కావడానికి, అతనిలో దేవుడిని చూడటానికి కారణం ఏంటి అనేది వీడియోలో చెప్పుకొచ్చాడు. రామాయణంలో వాల్మీకీ రాముడి పాత్రని చాలా ఉదారత, శాంతస్వభావుడు, ఒక సగటు మనిషిగానే చిత్రీకరించారు. అయితే అతని కోసం ప్రాణాలు ఇచ్చే హనుమాన్, లక్ష్మణుడు లాంటి రెండు బలమైన పాత్రలని సృష్టించాడు.
ఆ పాత్రల కారణంగా రాముడి పాత్రకి కూడా విశేషమైన గుర్తింపు ఉంది. ప్రశాంత చిత్తంతో ఉండే రాముడిని ఇప్పటికి భారతీయులు అందరూ గుండెల్లో పెట్టుకోవడానికి కారణం అదే. శ్రీకృష్ణుడుతో పోల్చుకుంటే రాముడు పాత్ర అంత గొప్పగా లేకపోయిన ఇండియాలో ఎక్కువగా పూజించేది మాత్రం శ్రీరాముడినే. దానికి కారణం రెండు మాస్ పాత్రలు అతని పక్కన ఉండటమే…
అమరేంద్ర బాహుబలి పాత్రని శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకొని డిజైన్ చేశాను. ఆ పాత్ర చుట్టూ బలమైన కట్టప్ప, శివగామి, దేవసేన పాత్రలని పెట్టాను. శ్రీరాముడి తరహాలోనే అమరేంద్ర బాహుబలి పాత్ర కూడా ప్రశాంతం చిత్తంతో ఉంటుంది. అవసరం అయితేనే తప్ప కోపం చూపించడు. ఒక పాత్ర ఔచిత్యం చెప్పాలంటే వారిని గొప్పగా చెప్పే మాస్ పాత్రలు పక్కన ఉండాలని రామాయణం కథ ద్వారా అర్ధమైందని రాజమౌళి చెప్పారు.
ఇప్పుడు ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. రాముడిని ఎలా చూపించాలో రాజమౌళి దగ్గర నేర్చుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. దానికి కారణం ఆదిపురుష్ సినిమాలో రాముడిని ఒక వీరుడిగా, పరాక్రముడిగా చూపించి అతనిలో ప్రధాన లక్షణమైన శాంత స్వభావాన్ని పూర్తిగా ఓం రౌత్ పక్కన పెట్టాడనే మాట వినిపిస్తోంది. అందుకే రాజమౌళి వీడియోని వైరల్ చేస్తున్నారు.