Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్' ఆ విషయంలో ఇబ్బందిపెట్టేసింది: రాజమౌళి
By: Tupaki Desk | 19 Dec 2021 9:47 AM GMTరాజమౌళి .. తెలుగు సినిమా గురించి తెలిసినవారికి ఈ పేరు తెలియకుండా ఉండదు. తెలుగు కథను తెరపై అందమైన చందమామ కథలా .. అద్భుతమైన దృశ్యకావ్యంలా ఆవిష్కరించిన దర్శకుడు. రాజమౌళి సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథలను అందిస్తూ వస్తున్నారు. అయితే ఆ కథను తెరపై ఎలా చూపించాలి? ఎక్కడ ఏ విషయాన్ని చెప్పాలి? ఎక్కడ ఏ అంశాన్ని విప్పాలి? ఏ మలుపులు ఎక్కడ కలపాలి? అనే పట్లు బాగా తెలిసిన దర్శకుడు రాజమౌళి.
ఆయన ఎప్పుడూ కూడా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలనే ఎంచుకుంటూ వస్తున్నారు. ఒక కథలో ఏయే అంశాలను ఎలా సర్దాలో .. ఏయే పాత్రలను ఎలా తీర్చిదిద్దాలో తెలిసిన దర్శకుడు ఆయన. కథ అనే రెండు చివరల కనిపించే హీరో - విలన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దే తీరు, మొదటి నుంచి చివరివరకూ ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటుంది. ఈ రెండు పాత్రలు కూడా ఎక్కడా తగ్గవు .. నువ్వా? నేనా? అన్నట్టుగానే ముందుకు సాగుతుంటాయి. తాను మనసులో ఏదైతే అనుకున్నాడో అలా వచ్చేంత వరకూ ఆయన కష్టపడుతూనే ఉంటారు. అందుకే ఆయన దేశం మెచ్చే దర్శకుడిగా ఎదిగారు.
రాజమౌళి తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఆర్ ఆర్ ఆర్' రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ .. అలియా భట్ .. అజయ్ దేవగణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన విషయం అందరికీ తెలుసు. ఇంతవరకూ కూడా ఎన్టీఆర్ - చరణ్ పాత్రలను పవర్ఫుల్ గా చూపిస్తూ వచ్చారు. అయితే నాయకుడి బలాన్ని .. ప్రతినాయకుడిని ఎదుర్కోవడాన్ని బట్టి అంచనా వేయవచ్చు. అలాంటి అంచనాకి వద్దామని అంటే 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో విలన్ ఎవరు? ఎన్టీఆర్ - చరణ్ వంటి పవర్ఫుల్ పాత్రలను ఏక కాలంలో ఎదుర్కొనే ప్రతినాయకుడు ఎవరు? అనేది ఇప్పటివరకూ సస్పెన్స్ గానే ఉంచారు.
రాజమౌళి సినిమాలో హీరోయిజం .. విలనిజం రెండూ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. తన గత చిత్రాలకి మించి ఆయన ఈ సినిమాలో హీరో - విలన్ పాత్రలను చూపిస్తారా? అనే ఆసక్తితో ప్రేక్షకులు ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. యుద్ధం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మంచిపై మంచి చేసే యుద్ధం .. చెడుపై మంచి చేసే యుద్ధం. మంచిపై మంచి చేసే యుద్ధంలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇద్దరు మంచి వాళ్లు యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరి వైపున ఉండాలనే విషయంలో ఆడియన్స్ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది.
'బాహుబలి'లో బాహుబాలి - శివగామి .. ఈ రెండు పాత్రలు మంచివే. అయితే ఒకానొక సందర్భంలో ఈ రెండు పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఆ సినిమాలో అది కొంతసేపు మాత్రమే చూపించాము. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విషయంలో మాత్రం కథ అంతా కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో హీరోలు .. విలన్లు అని కాకుండా కథను బట్టి .. తమ సిద్ధాంతాలను బట్టి పాత్రలు నడుస్తుంటాయి. ఈ సినిమాలోని విదేశీయుల పాత్రలను ఎవరితో చేయించాలి? అక్కడి ఆర్టిస్టులను ఎలా వెతికి పట్టుకోవాలి? అనేది మాకు చాలా టెన్షన్ అయిపోయింది.
ఆ పాత్రలకు ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడానికే మాకు చాలా సమయం పట్టేసింది. చివరికి ఒకసారి శేఖర్ కపూర్ తారసపడినప్పుడు అయన దగ్గర ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాను. అలాంటి ఆర్టిస్టుల విషయంలో అప్పటి వరకూ మేము చేస్తూ వస్తున్న ప్రయత్నాలు కరెక్ట్ కావని ఆయన చెప్పారు. అప్పటి నుంచి ఆయన చెప్పినట్టుగా ప్రయత్నాలు మొదలుపెట్టి మాకు కావలసిన విదేశీ ఆర్టిస్టులను తెచ్చుకోగలిగాము. అలా శేఖర్ కపూర్ గారు వలన ఈ ఇబ్బందుల నుంచి బయటపడ్డాము.
నేను సెట్లో అప్పటికప్పుడు డైలాగ్స్ మార్చడం వలన విదేశీ ఆర్టిస్టులు కొంత ఇబ్బంది పడ్డారు. అది గమనించి అప్పటి నుంచి నేను ముందుగానే వాళ్లకి డైలాగ్స్ పంపించడం మొదలుపెట్టాను. నేను ఏ సినిమా చేసినా అది కొన్నేళ్లపాటు ప్రేక్షకులకు గుర్తుండి పోవాలనుకుంటాను. 'ఆర్ ఆర్ ఆర్' కూడా అలాంటి సినిమానే అనడంలో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చారు.