Begin typing your search above and press return to search.
అప్పుడు మాత్రం టెన్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది: రాజమౌళి
By: Tupaki Desk | 16 March 2022 11:30 AM GMTసాధారణంగా చాలామంది దర్శకులు తమ వర్క్ విషయంలో టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే ఆ ఒక్క సినిమాపై ఎంతో మంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. తనకి మరో ఛాన్స్ రావాలన్నా .. తన ద్వారా మరో పదిమంది బ్రతకాలన్నా ముందుగా ఈ సినిమా హిట్ కావాలి. తనపై నిర్మాత పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. తనతో పాటు తన సినిమా కోసం పనిచేసిన వాళ్లందరి కెరియర్ ఊపందుకోవాలనే ఆలోచన చేస్తూ హడావిడి పడుతుంటారు.
కానీ వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలను రూపొందిస్తూ కూడా రాజమౌళి చాలా కూల్ గా కనిపిస్తారు. ఎప్పుడు ఎక్కడ చూసినా చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకే నానా రకాలుగా టెన్సన్ పడి చస్తుంటే, ఇంత పీస్ ఫుల్ గా ఉండటం రాజమౌళికి ఎలా సాధ్యమవుతోంది? అనే అంతా అనుకుంటూ ఉంటారు. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఈ సినిమా 25వ తేదీన విడుదల కానుండటంతో, ఆ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది.
అప్పుడు ఆయన స్పందిస్తూ .. "నా సినిమాకి సంబంధించిన ఏ పనిలోను నేను టెన్షన్ పడను. నాకు ఏం కావాలనే క్లారిటీ నాకు ఉంటుంది. అందువలన ప్రశాంతంగా నా పనిని నేను చేసుకుంటూ వెళుతుంటాను. నా సినిమా సమయంలో .. కథ .. పాత్రలు .. చిత్రీకరణ మొదలైన వాటిపైనే పూర్తి దృష్టి పెడతాను. నా సినిమా పూర్తయిన తరువాత మళ్లీ కరోనా వస్తుందా? థియేటర్లు మూతబడతాయా? నాపై ఎవరు ఎలాంటి విమర్శలు చేస్తున్నారు? అనే విషయాలను ఎంతమాత్రం దగ్గరలోకి కూడా రానీయను.
ఇక నా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో కూడా నేను ఎంతమాత్రం సమయాన్ని వృథా చేయను. నా సినిమాను జనం ముందుకు తీసుకుని వెళ్లడానికి ముందువరకూ నేను ఏం చేయగలనా అనేదే ఆలోచన చేస్తాను. ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసి .. రిలీజ్ కోసం నేను కూడా వెయిట్ చేసే సమయం ఒకటి వస్తుంది. అప్పుడు మాత్రం నాలో ఒక రేంజ్ లో టెన్షన్ ఉంటుంది. నేనూ అనుకున్నట్టుగా తీయగలిగానా? ప్రేక్షకుల అంచనాలను అందుకోగలుగుతానా? అనే టెన్షన్ బాగా ఉంటుంది.
'ఆర్ ఆర్ ఆర్' విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అంతకుమించి కొత్తగా ఏమీ ఉండదు. ఈ సినిమాకి కథానాయకులుగా ఎన్టీఆర్ - చరణ్ దొరకడం నాకు చాలా సంతృప్తిని కలిగించిన విషయం. ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ఏ సన్నివేశంలో ఎలా చేస్తాడనేది నాకు ముందుగానే తెలిసిపోతుంటుంది. అదే చరణ్ విషయానికి వస్తే, నేను చెప్పినట్టుగా ఆయన చేయగలడనే నమ్మకం కలుగుతుంది. ఈ సినిమాపై నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం వాళ్లిద్దరూ అని కూడా చెప్పచ్చు" అన్నారు.