Begin typing your search above and press return to search.
రిలాక్స్ అయ్యి వచ్చాక రచ్చ రచ్చే
By: Tupaki Desk | 4 Sep 2015 1:33 AM GMTబాహుబలి తో బంపర్ హిట్ కొట్టి జేజేలు అందుకున్నాడు జక్కన్న. రాజమౌళి ఉరఫ్ జక్కన్నదర్శకత్వం లో సినిమాలు తీయాలి.. అంటూ ప్రపంచం మొత్తం ఆరాలు తీస్తోందిప్పుడు. అంతటి విజయం, గుర్తింపు ఒక్క సినిమా తో కొట్టేశాడు. అందుకే ఇప్పుడు పూర్తిగా బాడీకి రిలాక్సేషన్ కావాలి. ఒక విజయం తర్వాత మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలంటే మైండ్ ఫుల్లు రిలాక్స్డ్ గా ఉండాలి. ఫ్రెష్ మైండ్ తో సముద్రాన్నే మదించేయవచ్చు. అందుకోసం రాజమౌళి ఫ్యామిలీ ట్రిప్ వేశాడు.
ఇండోనేషియా లోని బాలి తీర ప్రాంతాని కి టూర్ వెళ్లాడు. అక్కడ అందమైన బీచ్‌లో ఇసుక తిన్నెల్లో నచ్చినట్టు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. రమారాజమౌళి, కార్తీకేయ సహా ఫ్యామిలీ అంతా ఈ ట్రిప్ లో కలిసి బాలీ బీచ్‌లకు వెళ్లారు. విదేశీ ట్రిప్ నుంచి తిరిగి రావాలి. అక్టోబర్ లో ప్రారంభం కానున్న బాహుబలి 2 కోసం కసరత్తులు మొదలు పెట్టాలి. కాబట్టి శరీరానికి, మనసుకు కావాల్సినంత రిలాక్సేషన్ ఇచ్చి కథాచర్చల్లో పాల్గొనాలి.
నాలుగేళ్ల శ్రమ ఫలితం 600కోట్లు, ఇంకో ఏడాది లేదా రెండేళ్లు శ్రమిస్తే 1000 కో్ట్ల ఫలితం అందుకోవచ్చు. దానికోసం ఆమాత్రం చేయాల్సిందే మరి. యుద్ధంలో దిగే ముందు అమ్ముల పొదిని సిద్ధం చేసుకున్నట్టు .. రాజమౌళి అన్ని అస్ర్తాల్ని సిద్ధం చేసుకుంటున్నాడు ఇప్పట్నుంచే.