Begin typing your search above and press return to search.

కరోనా వైరస్ క్రైసిస్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఏం చేయబోతోంది..?

By:  Tupaki Desk   |   29 March 2020 8:10 AM GMT
కరోనా వైరస్ క్రైసిస్ కోసం ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఏం చేయబోతోంది..?
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాజమౌళి వీడియో ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. టాలీవుడ్ లో చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - మహేష్ బాబు - ప్రభాస్ - పవన్ కళ్యాణ్ - అల్లరి నరేష్ - నితిన్ మొదలైన స్టార్ హీరోలు విరాళాలు ప్రకటిస్తుండగా మీ బాధ్యతగా మీరు ఏమి చేయబోతున్నారు అని సదరు యాంకర్ ప్రశ్నించాడంట.

దీనికి రాజమౌళి సమాధానమిస్తూ 'అన్నిటికంటే ఇంట్లో నుండి బయటకి రాకుండా ఉండటం ఇప్పుడు మనందరి సామాజిక బాధ్యత. దేశం కష్టాల్లో ఉన్నప్పుడు అందరు తమ బాధ్యతగా విరాళాలివ్వడం అభినందించాల్సిన విషయం. మనకోసం తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పాటు పడుతున్న పోలీసులు - డాక్టర్లు - నర్సులకు పర్సనల్ ప్రొటెక్టీవ్ ఎక్విప్మెంట్స్ చాలా అవసరం. ఇవి రీసైకిల్ చేసేవి కూడా కాదు, మళ్ళీ వాడటానికి కూడా ఉపయోగపడదు. అలాంటివి ఇప్పుడు వాళ్ళకి చాలా తక్కువ మొత్తంలో లభిస్తున్నాయి. మా టీమ్ తరపున మేము పెద్ద మొత్తంలో ఫేస్ మాస్కులు - ప్రొటెక్టర్స్ అందించబోతున్నాం' అని ప్రకటించాడు. ఏదేమైనా ఇలా టాలీవుడ్ ప్రముఖులందరూ తమకు తోచిన విధంగా సహాయం చేస్తుండడం మంచి విషయం.