Begin typing your search above and press return to search.
జక్కన్న తప్పు చేస్తున్నాడా?
By: Tupaki Desk | 26 Aug 2016 5:30 PM GMTఒకప్పటి పరిస్థితి ఏమో చెప్పలేం కానీ - ప్రస్తుతం మాత్రం ఎవరు ఎదగాలన్నా.. ఎవరికి పబ్లిసిటీ రావాలన్నా మీడియాను ఆశ్రయించాల్సిందే! ఈ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే తలపండిన రాజకీయ నేతలు కూడా మీడియాతో పెట్టుకునేందుకు భయపడతారు. ఇక, ఇప్పుడు విషయానికి వస్తే.. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళికి తెలుగు మీడియాకు ఉన్న సంబంధం చెప్పలేం! ఎందుకంటే.. బాహుబలి ది బిగినింగ్ ప్రమోషన్ విషయంలో రాజమౌళికి ఇంత పేరు రావడానికి ప్రీ రిలీజ్ కి ముందు మీడియా చేసిన కృషి అంతా ఇంతని చెప్పడం కుదరదు. బహుశా కోట్లకు కోట్లు కుమ్మరించినా అంత పబ్లిసిటీ చేసి పెట్టేది కాదేమో తెలుగు మీడియా. కానీ.. తెలుగునాట స్పిల్ బర్గ్ గా ఎదుగుతున్న జక్కన్నకు ఆయన కోరకుండానే, ఎలాంటి డబ్బును ఆశించకుండానే తెలుగు మీడియా మొత్తం ఈ విషయంలో ఒక్కటైంది.
మూవీ ప్రీ రిలీజ్ నుంచి రిలీజ్ వరకు అన్నీ తానై బాహుబలికి విపరీతమైన ప్రచారం చేసిపెట్టింది తెలుగు మీడియా! ఆ తర్వాత మూవీ విడుదలైంది. అందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఎక్కడా ఆ లోపాలను బయటకు రానీయలేదు మీడియా! అంతేకాదు జక్కన్న అద్భుతమంటూ మూవీని స్కైకెత్తేసింది. మరి అలాంటి తెలుగు మీడియాను నెత్తిన పెట్టుకోవాల్సిన జక్కన్న ఇప్పుడు మాత్రం.. జాతీయ మీడియాను అక్కున చేర్చుకుంటున్నాడు. బాహుబలి-2కి సంబంధించిన సెన్సేషనల్స్ అన్నింటినీ ఆ మీడియాతో పంచుకుంటూ తెలుగు మీడియా కంట కనబడకుండా తిరుగుతున్నాడు.
ఇప్పుడు బాగానే ఉన్నప్పటికీ.. రేపు బాహుబలి-2ని కూడా ప్రమోట్ చేయాల్సింది తెలుగు మీడియానే అన్న సంగతిని జక్కన్న మరిచిపోయాడనే టాక్ వస్తోంది. ఇది ఆయనకి, బాహుబలి-2కి మంచిది కాదనే అన్న టాక్ తెలుగు మీడియాలో వినిపిస్తోంది. మరి జక్కన్న మారతాడో లేదో తెలీదుకానీ, ప్రస్తుతానికి మాత్రం తెలుగు మీడియా మాత్రం హర్ట్ అయింది. ఇక, లాగే రాజమౌళి కెరీర్ కి ఊపిరినిచ్చిన తెలుగు ప్రేక్షకులకు ముందుగా సమాచారం చేరవేయాలని ఆలోచించడం కూడా రాజమౌళి కెరీర్‌కి చాలా హెల్ఫ్ అవుతుంది.