Begin typing your search above and press return to search.
బాహుబలి ఇక్కడితో సంతృప్తి చెందాల్సిందే
By: Tupaki Desk | 18 July 2015 9:27 AM GMTబాహుబలి ఆలోచన మొదలయ్యే సమయానికి బహుశా రాజమౌళి సైతం అది ఇంత పెద్ద సినిమా అవుతుందని.. ఈ స్థాయిలో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుందని ఊహించి ఉండడు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా కొంచెం క్రేజ్ వస్తే.. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే చాలనుకుని ఉంటాడు. కానీ ఇప్పుడు పెట్టుబడి మీద రెట్టింపు వసూళ్లు వచ్చేలా కనిపిస్తోంది. బాహుబలి రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్లయితే.. తొలి భాగం మీద పెట్టుబడి రూ.125 కోట్లనుకోవాలి. ఐతే ఈ సినిమా ఫుల్ రన్లో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
బాహుబలి ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం కంటే కూడా అది సాధించిన రికార్డులే ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. తొలి రోజు వసూళ్లలో ‘హ్యాపీ న్యూఇయర్’ రికార్డును బద్దలు కొట్టేయడం.. ఫస్ట్ వీకెండ్, వీక్ కలెక్షన్లలో.. ఓవర్సీస్ వసూళ్లలో ‘పీకే’ సినిమాను దాటేయడం బాలీవుడ్ జనాల్ని విస్మయ పరుస్తోంది. ఐతే ఇప్పటి దాకా సాధించిన రికార్డులతో బాహుబలి టీమ్ ఫుల్ శాటిస్ఫై అయిపోవచ్చు. ఇంతకు మించి ఎక్కువ ఆశించకూడదు. ఎందుకంటే రెండో వారానికి బాహుబలి జోరు తగ్గింది. పైగా భజరంగి భాయిజాన్ సినిమా సూపర్ హిట్ టాక్‌తో మొదలైంది. తమిళ నాట కూడా ధనుష్ సినిమా ‘మారి’ వచ్చింది. కాబట్టి రోజులు గడిచేకొద్దీ బాహుబలి జోరు తగ్గుతూ పోతుంది. ఫుల్ రన్‌లో ఈ సినిమా రూ.200 కోట్ల షేర్ సాధిస్తే అద్భుతమనే చెప్పాలి. అప్పుడు గ్రాస్ వసూళ్లు రూ.300 కోట్లు దాటుతాయి. ‘రోబో’ రికార్డును కొట్టేసి సౌత్ ఇండియా వరకు నెంబర్ వన్ అనిపించుకుంటుంది బాహుబలి. మిగతా బాలీవుడ్ రికార్డుల గురించి బాహుబలి-2 వచ్చినపుడు ఆలోచించవచ్చు. కాబట్టి బాహుబలి ఇప్పటిదాకా సాధించిందాంతో సంతృప్తి చెందుదాం.