Begin typing your search above and press return to search.
మహేష్ తర్వాత కరణ్ తో జక్కన్న బిగ్ డీల్?
By: Tupaki Desk | 4 Jan 2022 10:30 AM GMTకొన్ని కలయికలు అరుదుగానే సాధ్యమవుతాయి. అసలు కుదురుతుందా? అనుకున్నవి కూడా స్నేహం సద్భావనతో సాధ్యమవుతాయి. బాలీవుడ్ కింగ్ మేకర్ .. టాప్ డైరెక్టర్ కం నిర్మాత కరణ్ జోహార్ చాలా కాలంగా పాన్ ఇండియా లెవల్లో సౌత్ ని బేస్ చేసుకుని ఓ భారీ చిత్రం చేయాలని కలలు గంటున్నారు. అది కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి భారీ ఆఫర్ ని ఇచ్చారని కూడా టాక్ వచ్చింది. కానీ దానికి ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆగిపోయింది.
కానీ ఇప్పుడు కరణ్ మరో డిఫరెంట్ యాంగిల్ లో నరుక్కుని వస్తున్నాడు. అతడు తొలిగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో కమిట్ మెంట్ కుదుర్చుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. జక్కన్న ఓకే చెప్పారు. అయితే ఇది ఎప్పుడు ఉంటుంది? అంటే.. దానికి ఆన్సర్ ఇంకా అస్పష్ఠంగా ఉంది.
రాజమౌళికి ఇప్పటికే మహేష్ తో కమిట్ మెంట్ ఉంది. ఆర్.ఆర్.ఆర్ రిలీజైన వెంటనే మహేష్ తో సినిమా చేస్తానని మాటిచ్చారు. కానీ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంతకంతకు ఆలస్యమవుతూనే ఉంది. అయితే ఈ మూవీ రిలీజ్ కాకముందే మహేష్ తో సినిమాని ప్రారంభిస్తారా లేదా? అన్నది వేచి చూడాలి. మహేష్ తో పూర్తయ్యాకే కరణ్ తో సినిమా చేస్తారా? అన్నదానికి రాజమౌళి కాంపౌండ్ నుంచి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంటుంది. జక్కన్న కమిటైతే ప్రభాస్ తో కలిపి ఈ సినిమా చేయాలని కరణ్ భావిస్తున్నారా? లేక ఇంకెవరినైనా హీరోగా ఎంపిక చేస్తారా? లేక హిందీ నటీనటులతో చేస్తారా? అన్నది కూడా స్పష్ఠత రావాల్సి ఉంటుంది. ఒకవేళ కొత్త తరం నటీనటులతో రాజమౌళి సినిమా చేస్తానని అంటే దానికి ఎలాంటి ప్రణాళిక ఉంటుందో.. ఏదేమైనా ఓ వైవిధ్యమైన ప్రయోగాత్మక స్క్రిప్టుతోనే రాజమౌళి-కరణ్ జోడీ ముందుకు వెళతారని లీకులు అందుతున్నాయి. బడ్జెట్ స్కేల్ ఏ రేంజులో ఉంటుందో కూడా వేచి చూడాలి. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఏదైనా కానీ.. అది పాన్ ఇండియా అప్పీల్ ఉన్నదే. అలాంటి క్రేజీ చిత్రంలో అవకాశం వరిస్తే ఏ స్టార్ కి అయినా దశ తిరిగిపోయినట్టే. బాహుబలి మొదలు రాజమౌళి ఏ సినిమా చేసినా హిందీ రిలీజ్ లకు కరణ్ సాయం ఉంటోంది. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ని కరణ్ జోహార్ సాఫీగా రిలీజయ్యేందుకు సహకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్నేహానుబంధంతోనే ఇప్పుడు జక్కన్న కమిట్ కావాల్సి వచ్చిందన్నమాట.