Begin typing your search above and press return to search.

పెద్దన్నకు 'దండాలయ్యా..' అంటూ దండం

By:  Tupaki Desk   |   17 July 2021 9:30 AM GMT
పెద్దన్నకు దండాలయ్యా.. అంటూ దండం
X
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకు సంగీతంను కీరవాణి అందించాడు. రాజమౌళి.. కీరవాణిల కాంబోలో సినిమాలన్నీ కూడా మ్యూజికల్‌ హిట్స్ అనడంలో సందేహం లేదు. అద్బుతమైన సాహిత్యంతో పాటు చిత్రీకరణ ఉండే రాజమౌళి సినిమాలోని పాటలు ఏళ్లకు ఏళ్లు తల్చుకుని పాడుకునేలా ఉంటాయి అనడంలో సందేహం లేదు.

బాహుబలి సినిమాలోని పాటలు ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి అంటే ఏ స్థాయిలో ఆ పాటలు సక్సెస్‌ అయ్యాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా కు కూడా ఖచ్చితంగా కీరవాణి అద్బుతమైన పాటలను అందిస్తాడనే నమ్మకంను ఇడస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఆ నమ్మకంను ఏమాత్రం వమ్ము చేయను అంటూ పెద్దన్న కీరవాణి ఆర్ ఆర్‌ ఆర్‌ మేకింగ్‌ వీడియోకు అద్బుతమైన బీజీని అందించాడు. చిన్న వీడియోకే బీజీ అదిరి పోతే సినిమా మొత్తం కూడా అద్బుతంకు మరింతగా ఆకర్షణ జోడించినట్లు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దన్న అంటూ కీరవాణిని రాజమౌళి పిలుచుకుంటారు. ఇద్దరి మద్య ఎంతటి అద్బుతమైన బాండింగ్ ఉంటుందో.. ఇద్దరు టెక్నీషియన్స్‌ గా ఎంత హుందాగా వ్యవహరిస్తారో వారి ద్వారా వచ్చే ఔట్ పుట్‌ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి మరియు కీవారణి ల కాంబోలో రాబోతున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ కూడా ఖచ్చితంగా మ్యూజికల్‌ గా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు.

కేవలం పాటలు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అద్బుతంగా ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి సినిమా లోని బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ ను మించి ఈ సినిమా లో బీజీ ఉంటుందని కొందరు యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇది కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విడుదల కాబోతుంది. కనుక అందుకు అనుగుణంగా కూడా బీజీ ఉండేలా కీరవాణి అద్బుతమైన సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. బాహుబలి సినిమాలో దండాలయ్య పాటను కీరవాణికి అన్వయించి అద్బుతం అంటూ ఆర్ ఆర్ ఆర్‌ మేకింగ్‌ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు.

కీరవాణి నుండి అద్బుతమైన ఔట్‌ పుట్ ను కేవలం రాజమౌళి మాత్రమే రాబట్టుకోగలరు. రాజమౌళి యొక్క గొప్ప మ్యూజిక్ టేస్ట్‌ కారణంగానే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాకుండా పాటలు కూడా అద్బుతంగా వస్తున్నాయంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమాలోని ప్రతి పాట ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు పదే పదే చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆడియో రైట్స్ కు అదిరిపోయే రేటు వస్తుందని నమ్మకం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా మరోసారి అధికారికంగా ప్రకటన చేశారు. కాని కరోనా థర్డ్‌ వేవ్‌ మాత్రం వారిని కాస్త టెన్షన్‌ పెడుతోంది. ఇప్పటికే ఆలస్యం అవ్వడం వల్ల అక్టోబర్‌ లో విడుదల చేసి తీరాలని బయ్యర్లు కూడా కోరుతున్నారట.

సాధ్యం అయినంత వరకు అక్టోబర్ లో విడుదల చేస్తారు. థర్డ్‌ వేవ్‌ ఏమైనా ఎఫెక్ట్‌ అయితే వచ్చే రిపబ్లిక్ డే వరకు సినిమా కోసం వెయిట చేయక తప్పదు అంటున్నారు. అల్లూరి, కొమురం భీమ్ ల పాత్రలను తీసుకుని పూర్తిగా కల్పిత కథతో రూపొందిస్తున్నారు. రామ్ చరణ్‌ మరియు ఎన్టీఆర్ ల అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ అభిమాని ఈ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు.