Begin typing your search above and press return to search.
బాలీవుడ్‌లో జక్కన్న? అంతా ఉత్తిదే
By: Tupaki Desk | 23 Jun 2015 11:30 AM GMTఎస్.ఎస్.రాజమౌళి అలియాస్ జక్కన్న 'బాహుబలి : ది బిగినింగ్' రిలీజ్ బిజీలో ఉన్నాడు. తెలుగు, తమిళ్, హిందీలో ఎట్టి పరిస్థితుల్లో జూలై 10న రిలీజ్ చేయడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నాడు. అవతలి వైపు పోటీ సినిమాలేం ఉన్నాయో చూసుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వేరే ఏ సినిమాకీ పోటీ వేయకుండా, తన సినిమాకి ఏ పోటీ లేకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు.
ఇదంతా ఒకెత్తయితే, ఇంతలోనే రాజమౌళి తర్వాతి సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడని గాలికబుర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్‌లో పాపులర్ అయిపోయాడు కాబట్టి అక్కడ కరణ్‌జోహార్‌తో కలిసి పనిచేస్తున్నాడు. అమీర్‌ఖాన్, షారూక్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోలతో కలిసి పనిచేస్తాడని ప్రచారం సాగుతోంది. అలాగే ఇప్పటికే పవన్, ఎన్టీఆర్‌ల కోసం కథలు రాసుకున్నాడు. వాటితో సెట్స్‌కెళతాడని టాలీవుడ్‌లో ప్రాచారం సాగిస్తున్నారు. అయితే ఇవన్నీ గాలివార్తలేనని తేలిపోయింది. కేవలం పుకార్లు మాత్రమే శికారు చేస్తున్నాయని ప్రూవైంది.
రాజమౌళి స్వయంగా చెప్పినదాని ప్రకారం.. '''బాహుబలి 2'కి కథ రెడీగా లేదు. 60 శాతం పైగా షూటింగ్ చేయాల్సి ఉంది. ఇంకా ఈ కథకి ఓ రూపం లేదు. మాటల్లేవ్.. సీన్లు లేవ్. అప్పుడే కొత్త సినిమా ఏంటి? ముందు బాహుబలి-2 పూర్తి చేయనివ్వండి. తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిద్దాం'' అని ఆన్నాడు. మ్యాటర్‌లో సీరియస్‌నెస్ అర్థమైందా?