Begin typing your search above and press return to search.

రాజమౌళి చెప్పింది అర్ధం కాలేదా??

By:  Tupaki Desk   |   4 Feb 2016 7:30 PM GMT
రాజమౌళి చెప్పింది అర్ధం కాలేదా??
X
నిజానికి రాజమౌళి ఏ స్టేట్ మెంట్‌ ఇచ్చినా అంతే.. మన తెలుగు మీడియా జనాలకు సరిగ్గా అర్ధంకాదు. నిన్ననే మనోడు సి.ఎన్‌.ఎన్‌. ఐ.బి.ఎన్‌ ఛానల్‌ కోసం ప్రముఖ జర్నలిస్టు రాజీవ్‌ మసంద్‌ కు ఇంటర్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో బాహుబలి 3 గురించి అడిగిన ఒక ప్రశ్నకు మాంచి సమాధానమే ఇచ్చాడు. అది విన్న తెలుగు మీడియా వారు రాజమౌళి కన్య్ఫూజ్‌ చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాని వాస్తవానికి రాజమౌళి కరెక్టు క్లారిటీయే ఇచ్చాడు.

గతంలో రాజమౌళి ఏమన్నాడంటే.. ''బాహుబలి 3 గురించి చాలా రూమర్లే వినిపిస్తున్నాయి. అయితే బాహుబలి 2 లో బాహుబలి మొదటి పార్టుకు సంబంధించిన స్టోరీ ఎండ్‌ అయిపోతుంది. ఎక్కువ డ్రాగ్‌ చేయను. కాకపోతే 3వ పార్టు ఎలా కంటిన్యూ అవుతుందీ, ఏంటి అనే విశేషాలు తరువాత చెప్తాను'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నిన్న ఇంటర్యూలో ఏమన్నాడంటే.. ''బాహుబలి చాలా పెద్ద స్టోరి. కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. చాలా భాగాలు తీయొచ్చు'' అన్నాడు. ఈ రెండు స్టేట్ మెంట్లు దాదాపు ఒకటే. కాని అప్పట్లో కంటిన్యూ అవ్వదని చెప్పిన రాజమౌళి ఇప్పుడు అవుతుంది అంటూ కన్ ఫ్యూజ్‌ చేస్తున్నాడు అంటూ మీడియా మిస్‌ అండర్ స్టాండ్‌ చేసుకుంది.

ఇప్పుడు అవంతిక (తమన్నా) అనే యువరాణి ఉంది.. ఆమె ఫ్యామిలీ ఎవరు.. వారి చరిత్ర ఏంటి.. ఇలా తీస్తే అది ఇంకో పార్టు అవుతుంది. అలా చాలా క్యారెక్టర్ల నుండి బాహుబలికి సంబంధించి చాలా భాగాలు తీయొచ్చు. కాకపోతే 3వ భాగం కోసం రెండో భాగంలో ఏదో ఒక లింక్‌ పెడితే పెట్టొచ్చు. స్పైడర్‌ మ్యాన్‌ 1 సినిమా చివర్లో.. ఎనర్జీ బాల్స్‌ చాలా దాచినట్లు చూపిస్తారు.. దానర్ధం స్టోరీ ఫినిష్‌ కాలేదు అని కాదు.. కొత్త స్టోరీకి ఒక బీజం వేశారు అని. అలాగే బాహుబలి 2 లో ప్రభాస్‌ రానా అనుష్కలకు చెందిన కథ ముగించేసి.. కొత్త కథకు బీజం వేసి క్లోజ్‌ చేయొచ్చు. అదే బాహుబలి 3. అర్ధమైందా?