Begin typing your search above and press return to search.
ఆ రూమర్‌పై జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు
By: Tupaki Desk | 6 July 2015 6:55 AM GMTరాజమౌళి సార్.. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ విలేకరుల సమావేశంలోనే మొహమాటం లేకుండా అడిగేశాడు తమిళ స్టార్ హీరో సూర్య. రాజమౌళి ఎప్పుడు అవకాశమిచ్చినా మరో మాట లేకుండా ఆ సినిమాలో నటిస్తానని కూడా చెప్పాడు. ఇదే సంగతి రాజమౌళి దగ్గర ప్రస్తావిస్తే.. సూర్య లాంటి నటుడికి చిన్న పాత్ర ఇస్తామా.. అవకాశమున్నపుడు ఆయనతో పని చేస్తా అన్నాడు. ఇంతలోనే బాహుబలి-2లో సూర్య ఓ ముఖ్య పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు పుట్టేశాయి. కొందరిది అఫీషియల్ న్యూస్ అని కూడా ప్రచారం చేశారు. తమిళ పత్రికలు, వెబ్ మీడియాలో కూడా ఈ వార్తలు కనిపించడంతో నిజంగానే సూర్య బాహుబలి-2లో నటిస్తున్నాడేమో అనుకున్నారు జనాలు.
ఐతే బాహుబలి-2లో సూర్య నటించడం లేదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న నటీనటులే.. రెండో పార్ట్‌లోనూ కొనసాగుతారని.. కొత్తగా క్యారెక్టర్లేమీ ఉండవని చెప్పాడు. బాహుబలి-2 అనేది వేరే సినిమా కాదని.. బాహుబలిలో భాగమేనని.. నిడివి పెరుగుతోందన్న ఉద్దేశంతోనే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నామని చెప్పాడు జక్కన్న. ఐతే తన క్యారెక్టర్ దేనికైనా సూర్య సరిపోతాడనుకుంటే కచ్చితంగా అతణ్ని అడుగుతానని చెప్పాడు. బాహుబలి-2 షూటింగ్ 40 శాతం మాత్రమే పూర్తయిందని.. సెప్టెంబరు 15 నుంచి షూటింగ్ ఆరంభించి ఇంకో 60 శాతం పూర్తి చేసి వచ్చే ఏడాది ఇదే సమయానికి రెండో భాగాన్ని విడుదల చేస్తామని రాజమౌళి వెల్లడించాడు.