Begin typing your search above and press return to search.
మహాభారతం... బ్రేకింగ్ న్యూస్
By: Tupaki Desk | 23 April 2017 10:48 AM GMTఎప్పటికైనా మహాభారతం సినిమాను తెరకెక్కించడం తన కల అని రాజమౌళి ఎప్పట్నుంచో చెబుతున్నాడు. కాకపోతే ఆ సినిమా చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అంటున్నాడు. ఐతే అతను ఇలా ప్రకటనలు చేస్తుండగానే వెయ్యి కోట్ల బడ్జెట్లో మోహన్ లాల్ ప్రధాన పాత్రధారిగా మహాభారత నేపథ్యంలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు మొదలైపోయాయి. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సైతం తన ప్రొడక్షన్లో మహాభారతం ఆలోచన చేస్తున్నాడు. మరి రాజమౌళి ఎప్పుడో దశాబ్దం తర్వాత మహాభారతం చేస్తానంటుండగా.. ముందే ఇవి తెరమీదికి వచ్చేస్తే ఇక రాజమౌళి సినిమా చేసి ఏం ప్రయోజనం అన్న చర్చ మొదలైంది.
ఐతే మహాభారతం మీద ఎవరు.. ఎన్ని సినిమాలు చేసినప్పటికీ తాను ఆ కథతో సినిమా చేయడం ఖాయం అంటున్నాడు రాజమౌళి. తాజాగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి మరోసారి మహాభారతం సినిమాపై స్పందించాడు. తాను తప్పకుండా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని చెప్పాడు. అయితే అదే మరో ఏడాదిలోనా.. లేక పదేళ్ల తరువాతనా అన్న విషయం మాత్రం ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు. మహాభారతం ఒక మహాసముద్రం అని వ్యాఖ్యానించిన జక్కన్న.. అందులో మోహన్ లాల్ టీం కొంత తీస్తే నేను కొంత తీస్తానని చెప్పాడు. ఎవరి కోణంలో వాళ్లు సినిమా చేయొచ్చన్నాడు. ఇలా ఎంతమందైనా ఆ నేపథ్యంలో సినిమా చేయొచ్చని తెలిపాడు. కాబట్టి ఎప్పటికైనా జక్కన్న మహాభారతం అన్నది పక్కా అన్నమాటే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/