Begin typing your search above and press return to search.
మహాభారతం ఇప్పుడు చేయలేను
By: Tupaki Desk | 25 Sep 2017 5:30 PM GMTబాహుబలి లాంటి దృశ్య కావ్యం కథని భారీ విజువల్స్ తో తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళిని ఎంత ప్రశంసించినా తక్కువే.. ఐదేళ్లు విశ్రాంతి లేకుండా రెండు భాగాలుగా తెరకెక్కించిన ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమా అంతటి విజయాన్ని అందుకోవడంతో రాజమౌళి స్థాయి తార స్థాయికి చేరింది. అయితే జక్కన్న నెక్స్ట్ ఎటువంటి సినిమా తీస్తాడు అనేది అందరిలోను ఆసక్తి నెలకొంది.
అయితే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజక్ట్ మహాభారతం తెరకెక్కిస్తాను అని చాలా సార్లు చెప్పాడు
దీంతో దానికి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఏమైనా జరుగుతుందా అని అంటే.. జక్కన్న తనదైన శైలిలో సమాధానాన్ని చెప్పాడు. మహాభారతం అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రమే ఆ సినిమాను తీస్తాను. కానీ ఇప్పుడు కాదు అందుకు తగిన సమయం ఇంకా ఉంది అనేలా దర్శకధీరుడు సమాధానాన్ని ఇచ్చాడు. ఇక బాహుబలి అంత విజయం సాధించి కదా ఆ సినిమాను కొనసాగించవచ్చు అనే కామెంట్స్ కి జక్కన్న సమాధానాన్ని ఇచ్చాడు.
బాహుబలి గొప్ప సినిమా. సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడింది. ఆ కథను రెండు సినిమాలతో ముగించాం. ఎందుకంటే ఆ కథ అంతవరకే ఉంది. మేము కూడా అంతవరకే తెరకెక్కించాం. ఒక వేళ కావాలని మార్కెట్ ఉంది కథా అని బాహుబలి పార్ట్ 3 తీస్తే..నమ్మకంతో తీయలేము. ఒక వేళ దానికి కరెక్ట్ గా కథ దొరికింది అనిపిస్తే.. తెరకెక్కించడానికి అభ్యంతరం లేదని తెలిపాడు.