Begin typing your search above and press return to search.

రాజమౌళి సినిమా.. నిర్మాత మాత్రం ఆయనే

By:  Tupaki Desk   |   26 May 2017 5:44 AM GMT
రాజమౌళి సినిమా.. నిర్మాత మాత్రం ఆయనే
X
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకు దాదాపు నెల కిందటే సమాధానం దొరికేసింది. కానీ ‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్నకు మాత్రం ఇంకా జవాబు దొరకలేదు. ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు కొనసాగుతుండగా.. రాజమౌళి మాత్రం ప్రశాంతంగా తన లోకంలో తాను ఉన్నాడు.

భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చాక.. కొన్ని రోజుల పాటు కథా చర్చలు జరిపిన రాజమౌళి.. మళ్లీ మరో చోటికి విహార యాత్రకు ప్లాన్ చేసుకున్నట్లుగా చెబుతున్నారు. మధ్యలో జరిగిన స్టోరీ డిస్కషన్ల తర్వాత రాజమౌళి తెలుగులో కాకుండా హిందీలో ఆల్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమా చేయాలని డిసైడైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ఈ సినిమా ఏ భాషలో చేసినా.. హీరోగా ఎవరిని ఎంచుకున్నా.. ఆ ప్రాజెక్టును నిర్మించేది మాత్రం డీవీవీ దానయ్యే అని వార్తలు వస్తున్నాయి.

రాజమౌళికి చాలా ఏళ్ల కిందటే దానయ్య అడ్వాన్స్ ఇచ్చాడు. కేఎల్ నారాయణకు కూడా కమిట్మెంట్ ఉన్నప్పటికీ ముందు దానయ్యకే సినిమా చేయాలని రాజమౌళి ఫిక్సయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జక్కన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో దానయ్య ఆనందానికి అవధుల్లేవట. ప్రస్తుతం మహేష్ బాబుతో కొరటాల దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమాను నిర్మిస్తున్న దానయ్య.. దీని తర్వాత రాజమౌళి సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.ఎంత ఖర్చయినా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని ఆయన భావిస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/