Begin typing your search above and press return to search.

శ్రీరాముడిపై జ‌క్క‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   24 Oct 2019 4:06 PM GMT
శ్రీరాముడిపై జ‌క్క‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
బాహుబ‌లితో అంత‌ర్జాతీయ స్థాయిలో రాజ‌మౌళి పేరు ఏ రేంజ్ లో మార్మోగిందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాహుబ‌లి-2 విడుద‌లై రెండేళ్లు పూర్త‌యినా ఇంకా ఆ ప్ర‌కంప‌న‌లు ప్ర‌పంచంలో ఏదో ఒక మూల క‌నిపిస్తూనే ఉన్నాయి. ఇటీవ‌లే బాహుబ‌లి చిత్రాన్ని లండ‌న్ లోని ప్ర‌ఖ్యాత రాయ‌ల్ ఆల్బ‌ర్ట్ లో ప్ర‌దర్శించారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు రాజ‌మౌళి- ప్ర‌భాస్- అనుష్క‌- రానా- కీర‌వాణి హాజ‌ర‌య్యారు. అక్క‌డి భార‌తీయులు.. లండ‌న్ మీడియా నుంచి జ‌క్క‌న్న‌కు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు ఎదుర‌వ్వ‌గా అంతే ఆస‌క్తిక‌రంగా స‌మాధానాలిచ్చారు. ఈ సంద‌ర్భంగా అమ‌రేంద్ర బాహుబ‌లి పాత్ర‌ను శ్రీరాముడితో పోల్చాడు జ‌క్క‌న్న‌.

ఆ పాత్ర‌లో అన్నీ రాముడి ల‌క్ష‌ణాలే. శ్రీకృష్ణుడి తో శ్రీరాముడు పాత్ర‌ను పోల్చితే క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు శ్రీకృష్ణుడి క‌థ అయితేనే బాగుంటుంద‌న్నాడు. శ్రీరాముడు జీవితంలో సీత ఒక్క‌రే భార్య‌. కానీ శ్రీకృష్ణుడికి ఎంత మంది భార్య‌లో అంద‌రికీ తెలుసు. రాముడి లైఫ్ లో ఒక్క లేడీ తో బోరింగ్ గా సాగింది. కానీ కృష్ణుడి లైఫ్ లో 20 మంది గోపిక‌లతో ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు ఉన్నాయి. రాముడు తండ్రి మాట జ‌వ‌దాట‌డు. సున్నిత మ‌న‌స్కుడు. ఇవేవి మ‌న క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌కు స‌రిపోవు. అందుకే శ్రీకృష్ణుడి క‌థ గ‌మ్మ‌త్తుగా ఉంటుంది. శ్రీకృష్ణుడికి ఎక్కువ‌గా గోపురాలు లేవు. రాముడికి 50 గుళ్లు ఉంటే శ్రీకృష్ణుడి గుడి ఒక‌టే ఉంటుంది.

అందుకే రామాయ‌ణం రాసేట‌ప్పుడు రాముడు ప‌క్క‌న ల‌క్ష్మ‌ణుడు.. అంజ‌నేయుడు లాంటి మాస్ పాత్ర‌లు మాత్రం అద్భుతం గా రాసారు. వాళ్లిద్ద‌రు రాముడు కోసం ప్రాణాలిచ్చిన ప‌రాక్ర‌మ‌వంతులు. ఆ విష‌యంలోనే రాముడికి అంతా బాగా క‌నెక్ట్ అయిపోయాం. శ్రీరాముడిని ఎవ‌రన్నా ఓ మాట అంటే ఒప్పుకోం. కానీ శ్రీకృష్ణుడిని అంటే లైట్ తీసుకుంటాం. బాహుబ‌లిలో అమ‌రేంద్ర బాహుబ‌లి ప‌క్క‌న అంజ‌నేయుడిలా క‌ట్ట‌ప్ప పాత్ర ఉండ‌టం వ‌ల్ల ఆ పాత్ర‌కు అంద‌రూ బాగా క‌నెక్ట్ అయ్యార‌ని తెలిపాడు. అలా బాహుబ‌లికి రామాయ‌ణం క‌నెక్ష‌న్ ఇచ్చారు జ‌క్క‌న్న‌.