Begin typing your search above and press return to search.

బాలయ్య తో సినిమా రాజమౌళి ఎందుకు చేయడంటే..!

By:  Tupaki Desk   |   19 Dec 2021 9:38 AM GMT
బాలయ్య తో సినిమా రాజమౌళి ఎందుకు చేయడంటే..!
X
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్‌ స్టాపబుల్‌ షో తాజా ఎపిసోడ్‌ లో రాజమౌళి మరియు కీరవాణిలు పాల్గొన్నారు. పలు విషయాల గురించి వీరిద్దరితో బాలకృష్ణ మాట్లాడటం జరిగింది. రాజమౌళి కూడా బాలయ్య గురించిన పలు విషయాలు వెళ్లడించాడు. బాలకృష్ణ తన గత ఎపిసోడ్స్ మాదిరిగానే ఈ ఎపిసోడ్ ను కూడా ఫన్నీగా మార్చేశాడు. రాజమౌళి మరియు కీరవాణిలతో సరదాగా బాలయ్య ముచ్చట్లు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. నా అభిమానులు అడుగుతున్నారు నాతో ఎప్పుడు సినిమా చేస్తావని అంటూ బాలయ్య ప్రశ్నించగా రాజమౌళి తనదైన శైలి లో సమాధానం చెప్పాడు. రాజమౌళి మాట్లాడుతూ నేను షూటింగ్‌ లో ఉన్న సమయంలో అస్సలు అవతలి వారిని పట్టించుకోను.. హీరో గారు ఎండలో ఉన్నారా.. ఎక్కడ ఉన్నారు అనేది పట్టించుకోను. పూర్తిగా నా పనిలో నేను నిమగ్నమై ఉంటాను. అలా మీతో ఉంటే మీకు ఎక్కడ కోపం వస్తుందో అనే భయంతో నేను మీతో సినిమా చేయలేదు అన్నట్లుగా రాజమౌళి చెప్పుకొచ్చాడు.

షూటింగ్ అంటే తాను ఎంత ఎండ ఉన్నా.. మరెలా ఉన్నా కనీసం గొడుకు కూడా పట్టించుకోకుండా ఎండ లో ఉండేందుకు కూడా సిద్దంగా ఉంటాను. నాతో అలాంటి భయం నీకు ఏమీ అక్కర్లేదు అన్నట్లుగా రాజమౌళి తో బాలయ్య అన్నాడు. మొత్తానికి ఇద్దరి మద్య పలు విషయాల గురించి చర్చ జరిగింది. ఇదే టాక్ షో లో తాను ఒక భారీ సినిమాను దర్శకత్వం చేసేందుకు ప్రయత్నించాను అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. అందుకు భారీ ఎత్తున బడ్జెట్‌ ఖర్చు అవుతుంది అనడంలో మా నాన్న గారు వద్దన్నారు. లేదంటే అప్పట్లోనే చాలా పెద్ద సినిమా తీసేవాడిని అన్నట్లుగా బాలయ్య చెప్పుకొచ్చాడు. రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా గురించి ఎక్కువ విషయాలను చెప్తాడని జనాలు ఆశించారు. కాని సినిమా గురించి పెద్దగా చర్చ లేకుండానే అన్ స్టాపబుల్‌ విత్‌ బాలయ్య ఎపిసోడ్‌ సాగింది అనేది కాస్త నిరాశ కలిగించే విషయం అంటున్నారు.

బాలయ్య సినిమా ల విషయానికి వస్తే అఖండ సినిమాతో టైటిల్ కు తగ్గ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న సినిమా కు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అవ్వడం.. సగం వరకు పూర్తి అవ్వడం కూడా జరిగిందని సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సమ్మర్ చివరి వరకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం లో బాలయ్య చేస్తున్న సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు రెగ్యులర్ గా అన్‌ స్టాపబుల్‌ షో కు హోస్టింగ్ చేస్తూ మరో వైపు బాలయ్య సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి మరియు కీరవాణి లు అన్ స్టాపబుల్‌ లో సందడి చేశారు.