Begin typing your search above and press return to search.

రాజ‌మౌళే అలా అంటే మిగ‌తా వాళ్లు ఏ ద‌శ‌లో వున్న‌ట్టు?

By:  Tupaki Desk   |   16 Sep 2022 10:30 AM GMT
రాజ‌మౌళే అలా అంటే మిగ‌తా వాళ్లు ఏ ద‌శ‌లో వున్న‌ట్టు?
X
బాహుబ‌లి, RRR వంటి భారీ పాన్ ఇండియా సినిమాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి క్రేజ్ ని, ఫేమ్‌ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే 'బాహుబ‌లి'తో వ‌చ్చిన క్రేజ్ కంటే రాజ‌మౌళికి RRR తో ద‌క్కిన క్రేజే ఎక్కువ‌. తెలుగులో తొలిసారి ఇద్ద‌రు టాప్ స్టార్లు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో క‌లిసి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన 'RRR' దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది.

అంతే కాకుండా వర‌ల్డ్ వైడ్ గా ఊహించ‌ని విధంగా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1200 కోట్లు రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఇక ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసిన త‌రువాత ఈ మూవీపై హాలీవుడ్ స్టార్స్‌, టెక్నీషియ‌న్స్‌, విదేశీ ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తూ సినిమాని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌మోట్ చేయ‌డం తో రాజ‌మౌళి పేరు హాలీవుడ్ లోనూ మారుమోగింది. దీంతో ప్ర‌తీ ఒక్క‌రు రాజ‌మౌళి గురించి చ‌ర్చించ‌డం మొద‌లు పెట్టారు.

ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇటీవ‌ల టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివెల్ లో ప్ర‌త్యేకంగా పాల్గొన్నాడు. ఈ నేప‌థ్యంలో అక్క‌డి మీడియాతో మాట్లాడుతూ రాజ‌మౌళి చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. బాహుబ‌లి 1, 2, RRR ల‌తో హాలీవుడ్ దృస్టిని ఆక‌ర్షించిన రాజ‌మౌళి ఈ సంద‌ర్భంగా మీడియాతో పంచుకున్న మాట‌లు ప్ర‌తీ ఒక్క‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి.

RRR గ్లోబ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచినా త‌ను నేర్చుకోవాల్సింది చాలా వుంద‌ని, నేర్చుకునే ద‌శ‌లోనే తాను వున్నాన‌ని రాజ‌మౌళి చెప్ప‌డం ప‌లువురిని షాక్ కు గురిచేసింది. తాను ఇంకా కొత్తగా నేర్చుకునే ద‌శ‌లోనే వున్నాన‌ని, RRR గ్లోబ‌ల్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచినప్ప‌టికీ క‌థ‌, క‌థ చెప్పే విధానంలో ఇ్ఆక ఒక ద‌గ్గ‌రే స్టిక్ అయిపోయి వున్నాన‌ని, ఇప్ప‌టికీ నేను ఇంకా నేర్చుకునే ద‌శ‌లోనే వున్నాన‌ని, న‌న్ను నేను మ‌రింత‌గా మార్చుకోవాల‌ని స్ప‌ష్టం చేశార‌ట‌.

అంతే కాకుండా త‌న‌దైన పంథా క‌థ‌నంతో పాశ్యాత్య సినిమాని తీయ‌డంపై దృష్టిపెడితే అది నాకు రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం అవుతుంద‌న్నారట‌. అంతే కాకుండా తాను నేర్చుకునే ద‌శ‌లోనే వున్నాను కాబ‌ట్టి త‌న‌ని మార్గ‌ద‌ర్శ‌కుడు అన‌డం కూడా అంత స‌బ‌బు కాద‌ని రాజ‌మౌళి స్ప‌ష్టం చేయ‌డం విశేషం.

బ్యాక్ టు బ్యాక్ రెండు గ్లోబ‌ల్ హిట్ ల‌ని అందించిన రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడే నేను ఇంకా నేర్చుకునే ద‌శ‌లోనే వున్నాన‌ని స్టేట్ మెంట్ ఇస్తే మిగ‌తా ద‌ర్శ‌కుల ప‌రిస్థితి ఏంటీ?..మిగ‌తా వాళ్లు ఏ ద‌శ‌లో వున్న‌ట్టు? అనే ప్ర‌శ్న మొద‌ల‌వుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.