Begin typing your search above and press return to search.

అలా అనిపించుకో రాజమౌళి!!

By:  Tupaki Desk   |   5 May 2017 12:49 PM GMT
అలా అనిపించుకో రాజమౌళి!!
X

''రాజమౌళి.. ఇండియన్ స్పీల్ బర్గ్'' అంటూ ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చూసినా కూడా రాజమౌళిని పొగిడేస్తున్నారు. అయితే బాహుబలి 1 అనే సినిమా జర్మనీ చైనా వంటి దేశాల్లో ఫ్లాపైన దృష్ట్యా.. అసలు ఇప్పుడు రాజమౌళి ఏం చేస్తే ప్రపంచంలో విపరీత ఖ్యాతిని పొందుతాడు అనేది ఒక చర్చ. పదండి ఈ డిస్కషన్ ఓసారి చూద్దాం.

నిజానికి స్పీల్ బర్గ్ రేంజులో రాజమౌళి తీశాడు అంటున్నారంటే.. అసలు స్పీల్ బర్గ్ రేంజేంటో చూడండి. ఎటువంటి కంప్యూటర్లు.. కంప్యూటర్ గ్రాఫిక్స్ లేనప్పుడు కూడా.. ''జాస్'' అనే సినిమా కోసం కృతిమంగా షార్కులను రూపొందించి.. వాటిని రోబోట్రానిక్స్ టెక్నాలజీ ద్వారా యానిమేట్ చేసి.. వెన్నులో వణుకుపుట్టే సినిమాలు తీశాడు స్పీల్ బర్గ్. ఆ తరువాత కంప్యూటర్ల సాయంతో రూపొందించిన ''జురాసిక్ పార్క్'' వంటి సినిమాలు ఆయన క్రియేటివిటీకు నిదర్శనం. ఇప్పుడు రాజమౌళి తీసిన బాహుబలి చూస్తే.. ఆల్రెడీ చాలా హాలీవుడ్ సినిమాల్లో వచ్చేసిన ఎఫెక్టులు.. వాడుతున్న టెక్నాలజీని మన దగ్గర ఇంట్రొడ్యూస్ చేయడం తప్పించి.. కొత్తగా ఈయనంటూ సృష్టించింది ఏమీ లేదు. యుద్దాలు కాని.. ప్యాలెస్ బిల్డింగ్స్ గ్రాఫిక్స్ కాని.. అన్నీ ఆల్రెడీ చూసినవే. అందుకే రాజమౌళి తన తదుపరి సినిమాలో వీటిపై ఫోకస్ పెడితే బాగుంటుంది. జనాలు స్పీల్ బర్గ్ ను అబ్బా రాజమౌళిలా తీశావ్ గురూ అనిపించుకునేంత స్థాయికి రాజమౌళి ఎదగాలి.

మరి బాహుబలి 2 సినిమాలో జనాలకు నచ్చింది ఏంటి అంటే.. ఈ గ్రాఫిక్స్ ఒక్కటే కాదుగా.. సినిమాలో డ్రామా అంతా కూడా రాజమౌళి మాయే. అందుకే ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/