Begin typing your search above and press return to search.
#RRR ఫస్ట్ షెడ్యూల్ పూర్తి..ఓటేద్దాం పదండి
By: Tupaki Desk | 6 Dec 2018 4:02 PM GMTటాలీవుడ్ జక్కన్న తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజమౌళి ప్రతి ఒక్కరు ఓటు వేయాలంటూ పిలుపునిచ్చాడు. ఓటింగ్ లో పాల్గొనేందుకు తన ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ చిత్రీకరణ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసినట్లుగా జక్కన్న పేర్కొన్నాడు. మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశాం, ఇక ఓటు వేద్దాం పదండి అంటూ రాజమౌళి పిలుపునిచ్చాడు.
ఓటు మన హక్కు - ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని రాజమౌళి పిలుపునిచ్చాడు. సెలబ్రెటీలు ఎంతో మంది కూడా నాకెందుకులే అనుకుంటూ మౌనంగా ఉంటే రాజమౌళి మాత్రం సామాజిక బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చాడు. బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును తప్పకుండా వేయాలి.
ఇక రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీస్టారర్ చిత్రాన్ని ఈనెల రెండు లేదా మూడునే మొదటి షెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉన్నా మూడు నాలుగు రోజులు అదనంగా చిత్రీకరణ జరిపారు. మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు పాల్గొన్నారు. అల్యూమీనియం ఫ్యాక్టరీలో హీరోలపై భారీ యాక్షన్ సీన్స్ ను జక్కన్న గత కొన్ని రోజులుగా చిత్రీకరించాడు. తదుపరి షెడ్యూల్ సంక్రాంతి తర్వాత ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.