Begin typing your search above and press return to search.
బాహుబలిని చంపింది కట్టప్ప కాదా?
By: Tupaki Desk | 30 July 2015 4:50 AM GMTకొశ్చెన్ ఆఫ్ ది ఇయర్ అంటూ ఓ ప్రశ్నతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు మార్మోగుతున్నాయి. `బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?` అనేదే ఆ ప్రశ్న. దానిపై మీడియాలోనూ చర్చ సాగుతోంది. `బాహుబలి` చూసినప్పట్నుంచి ఆ ప్రశ్నకి జవాబు ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సినిమా క్లైమాక్స్ లో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ `బాహుబలిని నేనే చంపా` అని ట్విస్ట్ ఇచ్చేశాడు. అది మొదలు అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు సినీ విశ్లేషకుల్లోనూ ఆ ట్విస్ట్ గురించి పెద్దయెత్తున చర్చ మొదలైంది. ఎవరెంత చర్చించుకొన్నా ఆ ట్విస్టు వెనక కథేంటన్నది `బాహుబలి2` వచ్చాకే తెలుస్తుంది.
అయితే బాహుబలి కథ సృష్టికర్త, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ `బాహుబలి` క్లైమాక్స్ కి మించిన మరో గొప్ప ట్విస్టు ఇచ్చాడు. ఆ ట్విస్టేమిటంటే... `బాహుబలిని కట్టప్పే చంపాడు అని ఎందుకు అనుకొంటున్నారు` అని వ్యాఖ్యానించి! ఓ ఇంటర్వ్యూలో విజయేంద్ర్రప్రసాద్ మాట్లాడుతూ `బాహుబలిని కట్టప్ప కేవలం పొడిచాడంతే` అని వ్యాఖ్యానించాడు. అంటే బాహుబలి మరణానికి అసలు కారకులు వేరే ఉన్నారని ఆయన మాటల్నిబట్టి చూస్తే అర్థమవుతోంది. బాహుబలి చంపడం వెనక వేరొకరు ఉన్నప్పటికీ కట్టప్ప తన చేతులతో ఎలా పొడవగలిగాడన్నది ఇప్పుడు డిస్కషన్ గా మారింది. మొత్తమ్మీద ఈ ట్విస్టు `బాహుబలి2`కి కావల్సినంత క్రేజ్ ని తీసుకొచ్చినట్టైంది.
`బాహుబలి2` విషయంలో కథ, కథనాల గురించి ప్రేక్షకులు రకరకాలుగా మాట్లాడుకొంటున్నారు. కథ అదంట, ఇదంట అని చెప్పుకొంటున్నారు. ఫేస్ బుక్కుల్లోనూ, వాట్సాప్ ల్లోనూ బాహుబలి 2 కథ అంటూ బోలెడన్ని స్టోరీలు ప్రచారంలో ఉన్నాయి. వాటికీ, బాహుబలి2కీ ఎంతో కొంత పోలిక ఉంటుందనీ, అందుకే ప్రేక్షకుడిని మరింత ఆశ్చర్యపరిచేలా కథలో భారీ మార్పులు చేయాలని రాజమౌళి నిర్ణయించుకొన్నాడట. ప్రేక్షకుడి అంచనాలకి భిన్నంగా సినిమా ఉండేలా కథని తీర్చిదిద్దే పనిలో చిత్రబృందం ఉన్నట్టు తెలిసింది. స్వయంగా రాజమౌళినే కథలో రెండు మూడు ట్విస్టులు జోడించినట్టు తెలిసింది. వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.