Begin typing your search above and press return to search.
2021 సంక్రాంతి వరకూ అలా లాక్
By: Tupaki Desk | 9 Feb 2020 12:30 PM GMTదర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఓవర్ ప్రొటెక్షన్.. ఓవర్ కేరింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. 2020 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ 2020 మూవీ ఆర్.ఆర్.ఆర్ కోసమే ఈ తపనంతా. ఈ సినిమాని ఎట్టి పరిస్థితిలో సెన్సేషనల్ హిట్ చేయడమే లక్ష్యంగా జక్కన్న టీమ్ అహోరాత్రులు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లు పైగా బడ్జెట్ ని డీవీవీ సంస్థ వెచ్చిస్తోంది.
తాజాగా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ని 2021 సంక్రాంతికి వాయిదా వేయడం ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకూ 80శాతం చిత్రీకరణ పూర్తయినా.. రాజమౌళి పెండింగ్ పనుల విషయంలో ఇంకా టెన్షన్ గానే ఉన్నారట. అందుకే సడెన్ గా రిలీజ్ ని వాయిదా వేశారు. అంతేకాదు.. ఈ సినిమాలో నటిస్తున్న స్టార్ క్యాస్టింగ్ ఎవరూ తన సినిమా పూర్తి చేసే వరకూ కదలకూడదన్న నియమం పెట్టారట. ముఖ్యంగా రామ్ చరణ్ - తారక్ ఇద్దరిపైనా జక్కన్న కండిషన్స్ అప్లయ్ అంటూ ఓ సమాచారం లీకైంది. అసలింతకీ జక్కన్న కండీషన్ ఏమిటి? అంటే.. ఒకటి ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ ప్యాచ్ వర్క్ సహా ప్రతిదీ పూర్తయ్యేవరకూ హీరోలు ఇద్దరూ తనతో ఉండాల్సిందే. తన కనుసన్నల్లోంచి బయటికి పోవడానికి వీల్లేదు. అలాగే చిత్రీకరణ సాంతం పూర్తయినా.. నెలరోజుల పాటు ఏకంగా ప్రచారం కోసం ప్లానింగ్ లో ఇమిడి పోవాల్సిందే. దానిని కాదని వేరే షూటింగుకి తారక్ కానీ.. చరణ్ కానీ వెళ్లిపోవడానికి లేదట.
అయితే చరణ్ .. ఎన్టీఆర్ ఇద్దరూ వేరే షూటింగులకు వెళతారని ప్రచారం సాగిపోతోంది. చిరు 152లో చరణ్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తాడని .. తారక్ త్రివిక్రమ్ సినిమాకి కాల్షీట్లు ఇచ్చేశాడని ప్రచారమవ్వడంతో జక్కన్న అలెర్టయిపోయాడు. మొత్తానికి ఆ ఇద్దరినీ తనదైన శైలిలో జక్కన్న లాక్ చేశాడని చెబుతున్నారు. చెర్రీ ఇప్పటికే జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరితోనూ ఓ సినిమాకి కమిటయ్యారన్న ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే చరణ్ - తారక్ స్నేహితులిద్దరూ విదేశీ వెకేషన్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. అయితే వెకేషన్ కి వెళ్లినా జక్కన్న కనుసన్నల్లోనే మెలగాల్సి ఉంటుందేమో! ప్చ్!!