Begin typing your search above and press return to search.
జనవరి 8న విడుదలకు ఆర్ ఆర్ ఆర్ సిద్ధం..
By: Tupaki Desk | 31 March 2020 3:30 AM GMTకరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం తో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్‌లోకి వెళ్లింది. సినిమా షూటింగులు ఆగిపోయాయి. అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో కూడా ఎవరికీ తెలీదు. ఇంతలో వచ్చే సంవత్సరం జనవరి 8న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తామని రాజమౌళి టీమ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని అభిమానులు వాపోతున్నారు.
కానీ రాజమౌళి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్ విడుదల గురించి స్పష్టం చేశారు. సినిమా షూటింగ్ 70% పూర్తయిందని తెలిపాడు. కాబట్టి, మిగిలిన భాగాన్ని జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేస్తామని, పోస్ట్ ప్రొడక్షన్, ప్రచారాలకు ఇంకా తగిన టైమ్ లభిస్తుందని తెలిపాడు. 'మేము 2021 జనవరి 8న సినిమాను విడుదల చేయడానికి సంసిద్దంగా ఉన్నాం' అంటూ తేల్చి చెప్పాడు. ఇది ఇలా ఉండగా ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఇటీవలే విడుదల చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ దెబ్బతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.
దీనితో ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్‌గా మే 20 న విడుదలయ్యే క్యారెక్టర్ వీడియో విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అలియా భట్ షూటింగ్ ఈ లాక్ డౌన్ అనంతరం ప్రారంభిస్తారట. అంతేగాక బాలీవుడ్ సింగం అజయ్ దేవగన్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను దానయ్య నిర్మిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇక ఖచ్చితంగా జనవరి 8న రిలీజ్ చేసాయనున్నట్లు రాజమౌళి క్లారిటీ ఇవ్వడం తో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.