Begin typing your search above and press return to search.

బళ్లారిపై జక్కన్న 6 లక్షల ప్రేమ

By:  Tupaki Desk   |   15 May 2017 10:54 AM GMT
బళ్లారిపై జక్కన్న 6 లక్షల ప్రేమ
X
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు ప్రపంచప్రఖ్యాతి పొందేశాడు. బాహుబలి మూవీతో తెలుగు సినిమా సత్తాను.. భారతీయ సినిమా స్థాయిని చాటి చెప్పాడు. ఇండియన్ మూవీకి ఎంతటి సత్తా ఉందో ససాక్ష్యంగా నిరూపించాడు జక్కన్న.

కేవలం పది రోజుల్లో 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రంగా బాహుబలి2ను తీర్చిదిద్దిన రాజమౌళి.. కొన్ని రోజుల క్రితం ఇంగ్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని రోజుల పాటు ఉన్న జక్కన్న.. ప్రమోషన్స్ తో పాటు హాలిడేస్ కూడా గడిపాడు. రీసెంట్ గా హైద్రాబాద్ కి తిరిగి వచ్చిన రాజమౌళి.. వెంటనే కర్నాటక వెళ్లడం విశేషం. కర్నాటకలోని బళ్లారికి వెళ్లిన రాజమౌళి.. అక్కడ స్వచ్ఛ్ బళ్లారి కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంతే కాదు.. బళ్లారికి 6 లక్షల రూపాయల విరాళం కూడా ప్రకటించడం విశేషం. జక్కన్న అమితంగా ఇష్టపడే నిర్మాతల్లో ఒకడైన సాయి కొర్రపాటి సొంత ఊరు బళ్లారి. ఆయన కోసమే జక్కన్న బెళ్లారి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి కూడా తన చిన్నతనంలో అక్కడ కొన్నాళ్ళు కాలంగడిపాడు. అందుకే కన్నడ కూడా అవలీలగా మాట్లాడతాడు.

ఇక ఇదే కార్యక్రమంలో తర్వాతి సినిమా గురించి చెప్పమంటే మాత్రం.. ఎప్పటిలాగే రాజమౌళి మాట దాటేయడం విశేషం.