Begin typing your search above and press return to search.
రాజమౌళి కష్టం విలువ!
By: Tupaki Desk | 28 March 2016 11:30 AM GMTతెలుగు సినిమా ఇలానే ఉండాలనే ఆలోచనలో నుండి ప్రేక్షకుల్ని, దర్శకుల్ని - టోటల్ గా తెలుగు సినిమానే బయటకు తీసుకొచ్చాడు రాజమౌళి. దానికి సాక్ష్యాలే.. మగధీర - ఈగ - మర్యాద రామన్నలాంటి సినిమాలు. ఇప్పుడు బాహుబలితో వంద మెట్లు పైకి తీసుకెళ్లాడు. బాహుబలి వస్తే... రికార్డులు బద్దలవవ్వడం ఖాయం అని అందరూ నమ్మారు. ఆ నమ్మకాన్ని ఆ సినిమా అక్షరాలా నిలబెట్టింది కూడా. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలను వసూలు చేసి ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకొనేలా చేసింది.
ఓ గౌరవాన్ని తెలుగు సినిమాకి కల్పించింది బాహుబలి. ప్రపంచమంతా ఒక్కసారిగా తెలుగు సినిమావైపు చూసేలా చేసింది. తెలుగు సినిమా సాంకేతికంగా ఎంత ఎదిగిందో, ఎన్ని అద్భుతాలు చూపించగలదో.. బాహుబలి నిరూపించింది. ఓ విజువల్ ఫీస్ట్ ని భారతీయ సినిమాకి అందించింది. అందుకే.. ఇప్పుడు ఆ కష్టాన్ని - టీమ్ మొత్తం చూపించిన ప్రతిభని జాతీయ అవార్డుల కమిటీ జ్యూరీ గుర్తించి జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలిని ఎంపిక చేసింది.