Begin typing your search above and press return to search.

RRR గ్లిమ్స్ తో జ‌క్క‌న్న‌ ఎలివేట్ అయ్యాడు అంతే!

By:  Tupaki Desk   |   2 Nov 2021 4:42 AM GMT
RRR గ్లిమ్స్ తో జ‌క్క‌న్న‌ ఎలివేట్ అయ్యాడు అంతే!
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రిలో విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసింది. రెండు నెల‌ల ముందు నుంచే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచారు రాజ‌మౌళి. ఇప్ప‌టికే హిందీ మీడియాకి ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్స్ ని చూపించి స‌ర్ ప్రైజ్ చేశారు. హిందీ బెల్టులో భారీ బిజినెస్ సాగుతున్న క్ర‌మంలో అక్క‌డి వారికి గ్లిమ్స్ ద్వారా కాన్ఫిడెన్స్ ని పెంచార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

నిన్న‌టిరోజున ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్స్ ని రాజ‌మౌళి టీమ్ రిలీజ్ చేసింది. ఈ విజువ‌ల్ చూసిన వారంతా ముక్త కంఠంతో ఇది భారతీయ చలనచిత్ర వైభవాన్ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డం ఖాయం అన్న ధీమానిచ్చింది. ఆర్.ఆర్.ఆర్ గ్లిమ్స్ వీక్షించిన వారంతా వ్వావ్ అన‌కుండా ఉండ‌లేక‌పోయారు. నిర్మాత‌లు తొలి నుంచి ప్రామిస్ చేసిన‌ట్టే ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ తో భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో నెవ్వ‌ర్ బిఫోర్ అనే రేంజులో తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది తెలుగు సినిమా ఘ‌న‌కీర్తిని ప్ర‌పంచానికి విస్త‌రించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక ర‌కంగా ఈ చిత్రం ఏ హాలీవుడ్ విజువ‌ల్ ఫీస్ట్ కి త‌గ్గ‌ని రీతిలో తెర‌కెక్కింద‌ని అర్థ‌మ‌వుతోందన్న ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. 40 సెక‌న్ల నిడివితో టీజ‌ర్ ఒళ్లు జ‌ల‌ధ‌రించే రేంజులో ఉంది. ఇందులో ర‌ణం రౌద్రం రుదిరం అనే అంశాల్ని మ‌రువ‌కుండా రాజ‌మౌళి ఏర్చి కూర్చారు. ప్ర‌స్తుతం టీజ‌ర్ గ్లిమ్స్ దూసుకెళుతోంది. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులంతా ఈ గ్లిమ్స్ వీక్షించాక సంబరాల్లో మునిగి తేలారు. అయితే గ్లిమ్స్ ని ప‌రిశీల‌న‌గా వీక్షిస్తే అస‌లు స్టార్ ప‌వ‌ర్ ని మించి డైరెక్ట‌ర్ ప‌వ‌ర్ ఎలివేట్ అయ్యింద‌ని స్ప‌ష్ఠంగా అర్థ‌మ‌వుతోంది. RRR గ్లిమ్స్ తో జ‌క్క‌న్న‌ ఎలివేట్ అయ్యాడు అంతే! అని విశ్లేషించిన సెక్ష‌న్ ఉంది అంటే ఈ టీజ‌ర్ ని ఎంత తెలివిగా క‌ట్ చేశారో అర్థం చేసుకోవ‌చ్చు.

వీడియో అంతటా రాజ‌మౌళి దృష్టి కోణం ఆ ముద్ర స్ప‌ష్ఠంగా కనిపిస్తుంది. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ విష‌యాల్ని టీజ‌ర్ లో ఎలివేట్ చేయ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం. ఆ కొన్ని సెకన్లలో చాలా ఎక్కువ చూపించారు. ప్రతి సెకనును ప్రతి ఫ్రేమ్ లో కొత్తదనాన్ని ఆవిష్క‌రించారు. ఇది చాలా వేగంగా క‌దులుతుంది. లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో స‌రికొత్త‌ స్క్రీన్ అనుభవం ద‌క్కుతుంద‌ని తొలి నుంచి SS రాజమౌళి బృందం చెబుతూనే ఉంది. ప్రామిస్ కి త‌గ్గ‌ట్టే ఆర్.ఆర్.ఆర్ ని తెర‌కెక్కించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఇందులో పులి ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అర్థ‌మైంది. ఇక ఈ గ్లిమ్స్ కి ఎం.ఎం.కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ మ‌హ‌దాద్భుతం. అడ‌విలో నిశీధిని నిశ్శ‌బ్ధాన్ని ఒక సెక‌నులో అద్భుతంగా ఆవిష్క‌రించారు. పెద్ద స్క్రీన్ పై విజువ‌ల్ వీక్ష‌ణ‌తో పాటు రీరికార్డింగ్ వింటుంటే ఒళ్లు గ‌గుర్పొడుస్తుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్ గా గ్లిమ్స్ పెద్ద స‌క్సెసైంది. సినిమాపై భారీ హైప్ ని పెంచింది.

ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అజయ్ దేవగన్ - అలియా భట్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. RRR జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అత్యంత భారీ బిజినెస్ చేస్తున్న సినిమాగా స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్ప‌నుంది.