Begin typing your search above and press return to search.
జక్కన్నను ఇలా ఎప్పుడైనా చూశారా..?
By: Tupaki Desk | 27 April 2016 6:07 AM GMTపైన హెడ్డింగ్ చూడకుండా ఈ ఫొటో చూసి.. అక్కడ కేరింతలు కొడుతోంది ఎవ్వరో చెప్పమంటే కనుక్కోవడం కష్టమే. ఎప్పుడూ సినిమా లోకంలోనే విహరించే రాజమౌళి.. ఇలా స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ కేరింతలు కొట్టడం అన్నది అరుదైన విషయం. అది కూడా బాహుబలి-2 లాంటి భారీ ప్రాజెక్టు తలకెత్తుకుని.. ఇలా స్టేడియానికి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఐతే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ‘బాహుబలి’ టీం మొత్తానికి జక్కన్న నెల రోజులు సెలవులు ప్రకటించేసిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో మళ్లీ ‘బాహుబలి’ గురించే ఆలోచించడం ఎందుకని అప్పుడప్పుడూ ఇలా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లున్నాడు జక్కన్న.
ఆదివారం ధోని జట్టు పుణె సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ మ్యాచ్ కావడంతో జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జనాలు పెద్ద ఎత్తున స్టేడియానికి వచ్చారు. ఉప్పల్ స్టేడియం నిండిపోయింది. ఆ జనాల్లో రాజమౌళి కూడా ఉన్నాడు. సన్ రైజర్స్ టీంకు మద్దతుగా ఆరెంజ్ బ్యాడ్జ్ ధరించి మరీ జక్కన్న స్టేడియంలో సందడి చేయడం విశేషం. వర్షం వల్ల గంట ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్ లో పెద్దగా పరుగులు పోటెత్తకపోయినా.. సన్ రైజర్స్ ఓడిపోయినా.. రాజమౌళి మ్యాచ్ ను బాగానే ఎంజాయ్ చేసినట్లున్నాడు. సగటు క్రికెట్ అభిమానిగా మారిపోయి.. ఇలా కేరింతలు కొడుతూ కనిపించిన జక్కన్నను చూసి స్టేడియంలో జనాలంతా ఆశ్చర్యపోయారు.