Begin typing your search above and press return to search.
ఈ రోజుపై.. రాజమౌళికి రెండు ఫీలింగ్స్
By: Tupaki Desk | 9 July 2016 12:59 PM GMTఈరోజు జూలై 9. అంటే ఒక ప్రత్యేకత ఉంది. గత ఏడాది జూలై 10న తెలుగు సినిమా స్థాయినీ చరిష్మానీ పెంచిన ''బాహుబలి'' సినిమా విడుదలైంది. అందుకే జూలై 9 అనేసరికి గత సంవత్సరం పడిన టెన్షన్ అంతా బాహుబలి టీమ్ కు గుర్తొస్తోంది. అయితే ఈరోజుకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. అందుకే రాజమౌళి ఒకేరోజున తనకు ఎలా రెండు ఫీలింగ్స్ ఉన్నాయో చెప్పుకొచ్చాడు.
సరిగ్గా 13 ఏళ్ల క్రితం.. జూలై 9న సింహాద్రి సినిమా విడుదలైంది. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే.. ఎన్టీఆర్ ను అతి చిన్న వయస్సులోనే ఒక సూపర్ మాస్ హీరోను చేసేసింది. అలాగే రాజమౌళి కూడా ఒక నెం.1 డైరక్టర్ అయిపోయాడు. అయితే సరిగ్గా సంవత్సరం క్రితం అదే రోజున సింహాద్రి రిలీజైంది అనే ఆనందంకంటే.. రేపే బాహుబలి రిలీజ్ అనే టెన్షన్ ఎక్కువగా ఉందట మన దర్శక దిగ్గజానికి. సరిగ్గా ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీ ద్వారా చెప్పుకొచ్చాడు జక్కన్న.
ఇదే విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ.. ఆయన కూడా రిలీజ్ కు ముందురోజు చాలా ఉద్వేగానికి గురయ్యాడట. సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు.. అసలు రిజల్టు ఎలా ఉండోబోతంది.. సంవత్సరాల తరబడి తమ కృషికి ఫలితం ఎలా ఉంటుందో అంటూ ఆందోళన చెందారట. ఇకపోతే రేపు బాహుబలి టీమ్ 1వ వార్షికోత్సవం వేడుకను ఘనంగా చేసుకోనున్నారు.