Begin typing your search above and press return to search.
జక్కన్నా..మీ ఫ్యామిలీకి దిక్కు నువ్వేనా..!
By: Tupaki Desk | 13 March 2020 8:21 AM GMTప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాదు - బాలీవుడ్ - కోలీవుడ్ లతో పాటు దేశం మొత్తం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగారు ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి సినీ ప్రయాణంలో మొదటి నుండి ఆయనకు తన కుటుంబం అండగా నిలుస్తూ వస్తుంది. రాజమౌళి సినిమాలకు కథలు ఒకరు అందిస్తే, సంగీతం ఒకరు. కాస్ట్యూమ్స్ ఒకరు - పబ్లిసిటీ ఒకరు - అసిస్టెంట్ ఒకరు ఇలా ప్రతి సినిమాలోని ప్రతి డిపార్ట్ మెంటులో ఆయన కుటుంబీకులు ఉన్నారు.
కానీ అసలు విషయం ఏంటంటే.. రాజమౌళి కుటుంబీకులు సొంతంగా ట్రై చేసిన ప్రతిసారి బోల్తాపడుతున్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. రాజమౌళి సినిమాలకు తప్ప ఆ స్థాయి సంగీతాన్ని వేరే సినిమాలకు ఆందించలేకపోతున్నాడు. విజయేంద్ర ప్రసాద్ కొడుకు సినిమాలకు తప్ప వేరే సినిమాలకు కథలు రాయలేక - దర్శకునిగా విజయాన్ని పొందలేక పోతున్నాడు. నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకున్న రాజమౌళి కొడుకు కార్తికేయ విఫలమైన సంగతి తెలిసిందే.
ఇలా తన కుటుంబంలోని ప్రతి ఒక్కరు బయట సొంతంగా నిలదొక్కుకోలేక మళ్లీ రాజమౌళి సినిమాలకే పనిచేస్తున్నారు. అందరు ప్రతిభావంతులే అంటారు మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది తేలని ప్రశ్న. చూడాలి మరి వారి కుటుంబీకుల నుండి త్వరలోనే ఏమైనా క్రేజీ ఖబర్ అందుతుందేమో..!