Begin typing your search above and press return to search.
ఆ విషయంలో రాజమౌళి.. సుకుమార్ ల కంటే పూరి బెస్ట్ : విజయేంద్ర ప్రసాద్
By: Tupaki Desk | 5 Aug 2021 5:37 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈమద్య కాలంలో పలు ఇంటర్వ్యూలో కనిపిస్తూ ఉన్నారు. ఆయన పదే పదే తెలుగు మీడియా లేదా జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరో మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెళ్లడించాడు. ఆయన కథలు రాసే పద్దతిని మొదలుకని తన కొడుకులోని లోపాల వరకు పలు విషయాలను గురించి ఆయన చర్చించాడు. ముఖ్యంగా రాజమౌళి గురించి మాట్లాడుతూ సినిమా ను తీయడం లో అద్బుత ప్రతిభ కలిగిన రాజమౌళికి కథలు రాసుకోవడం కాస్త కష్టం. మంచి కథలను ఎంచుకోవడం లో మాత్రం అతడికి సాటి మరెవ్వరు లేరు అన్నట్లుగా ఉంటాడు.
సినిమాను తీయడం విషయంలో దిట్ట అయిన రాజమౌళి ఒక విషయంలో మాత్రం బలహీనంగా కనబడుతాడు. అదే సినిమాల మేకింగ్ కు తీసుకునే సమయం. ఒక్కో సినిమాకు చాలా సమయంను తీసుకుంటాడు. దాన్ని సరి చేసుకోవాల్సిందిగా చెప్పి చెప్పి అలసి పోయాను. కాని అతడు మాత్రం సినిమాల మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచడం లేదని చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో సుకుమార్ పద్దతి కూడా అదే అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. అద్బుతమైన సినిమాలను తీయగల సమర్థులు అయిన సుకుమార్ కూడా మేకింగ్ చాలా స్లోగా ఉంటుందని సుకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
స్పీడ్ గా సినిమాలు తీయాలంటే పూరి తర్వాతే మరెవ్వరైనా అన్నారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అన్నట్లుగా సినిమా లను ఆయన తీయగలడు అంటూ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన లో నాకు నచ్చే లక్షణం అదే అన్నారు. పూరి చిన్న సన్నివేశంలో కూడా ఫైట్ సీన్ ను చేర్చగల సమర్థులు. ఆయన సన్నివేశాల్లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవ్వగలరు అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇక రాజమౌళి నుండి ముందు ముందు కూడా స్పీడ్ గా సినిమాలు వస్తాయనే నమ్మకం లేదు అన్నాడు. త్రివిక్రమ్ సినిమాలు అన్నా కూడా తనకు ఇష్టం అని.. దర్శకుడిగా ఆయన మంచి ప్రతిభ ఉన్న టెక్నీషియన్ అన్నాడు.