Begin typing your search above and press return to search.
రాజమౌళి దృష్టిలో ‘ది బెస్ట్’ ఎవరు?
By: Tupaki Desk | 31 May 2017 9:07 AM GMT‘బాహుబలి’ సినిమా అనగానే అందరూ అందులోని విజువల్ ఎఫెక్ట్స్.. యుద్ధ సన్నివేశాలు.. ఇతర అదనపు ఆకర్షణల గురించే మాట్లాడుకుంటారు. కానీ అందులో బలమైన పాత్రలున్నాయి. ఆ పాత్రలు పోషించిన నటీనటులందరూ అద్భుత అభినయం ప్రదర్శించారు. మరి వీళ్లందరిలో ది బెస్ట్ ఎవరు అంటే.. ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుంది. కొందరు ప్రభాస్ ది బెస్ట్ అంటారు.. ఇంకొందరు రమ్యకృష్ణే నంబర్ వన్ అంటారు. ఇంకొందరికి రానా నచ్చుతాడు. మరికొందరికి సత్యరాజే బాగా నచ్చాడు. మరి దర్శకుడు రాజమౌళి దృష్టిలో ‘బాహుబలి’లో అత్యుత్తమంగా నటించింది ఎవరు.. అంటే ఆయన ‘నాజర్’ అని సమాధానం ఇచ్చాడు.
బాహుబలి సినిమాలో మిగతా వాళ్లందరికీ బలమైన పాత్రలు దక్కాయని.. నాజర్ క్యారెక్టర్ మాత్రమే వీక్ అని అన్నాడు రాజమౌళి. మిగతా నటీనటులందరూ కూడా చాలా బాగా నటించారని.. ఐతే అందరిలో ఒకరిని ఎంచుకోమంటే తాను నాజర్ కే ఓటు వేస్తానని రాజమౌళి తెలిపాడు. నాజర్ పాత్ర అంత బలంగా ఏమీ ఉండదని... ఆ పాత్ర లేకపోయినా సినిమాలో తేడా ఏమీ ఉండదని జక్కన్న అన్నాడు. బిజ్జాల దేవ పాత్ర వెయిట్ తక్కువైనప్పటికీ.. నాజర్ తన నటనతో ఆ పాత్రను నిలబెట్టాడని.. ప్రతి సన్నివేశంలోనూ ‘నేనున్నాను’ అనిపించేలా నటించాడని అన్నాడు రాజమౌళి. అందుకే నాజర్ ‘ది బెస్ట్’ అంటానని అన్నాడు. మామూలుగా రానా.. అనుష్క నటన పరంగా కొంచెం వీక్ అయినప్పటికీ ‘బాహుబలి’లో మాత్రం చాలా బాగా నటించారని.. ముఖ్యంగా దేవసేన మహిష్మతి రాజ దర్బారులోకి ప్రవేశించాక వచ్చే సన్నివేశంలో ఇద్దరూ చాలా బాగా చేశారని.. రానా ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా నాజర్ మీద చేయి వేస్తూ.. తీస్తూ హావభావాలు పలికించే సన్నివేశంలో అదరగొట్టాడని రాజమౌళి తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/