Begin typing your search above and press return to search.
జక్కన్న ఫోకస్ ప్రభాస్, రమ్యకృష్ణపైనే
By: Tupaki Desk | 18 Dec 2015 4:27 AM GMTజక్కన్న అలియాస్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెట్స్ కి వెళ్లకముందే .. జక్కన్నబోలెడంత ముందస్తు కసరత్తు చేశారు. 4 నెలల పాటు ఇదే పనిలో ఉన్నారాయన. రచయితలు - ఆర్ట్ డిపార్ట్ మెంట్ టీమ్- సెట్ డిజైన్ టీమ్ - గ్రాఫిక్స్ డిజైన్ టీమ్ - సినిమాటోగ్రఫీ టీమ్ - యాక్షన్ డిజైన్ టీమ్ ఇలా అందరితో కలిసి జక్కన్న తన వ్యూస్ ని షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ని బాహుబలి -1తో కంపార్ చేస్తే బాహుబలి -2లో పరాకాష్టలో ఉండాలన్న ఆలోచన చేశాడు.
ఈ రెండో భాగంలో ప్రభాస్ - రానా విరోచిత పోరాటాల్ని తెలుగు ప్రేక్షకులకు చూడాల్సి ఉంటుంది. అవి సినిమా జయాపజయాల్ని నిర్ణయించేవిగా ఉంటాయి. అలాగే సీనియర్ నటీమణి రమ్యకృష్ణతో ప్రభాస్ సన్నివేశాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ మూవీలో అవి కూడా కీలకమైనవి. క్యూరియాసిటీని పెంచేవిగా ఉంటాయి. వాటిని ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. రాజమాతగా రమ్యకృష్ణ కోరిక మేరకు రాక్షసరాజు కాళకేయను చంపి యుద్ధంలో గెలుపొందాడు బాహబులి. అతడిని రాజ్యానికి రాజుగా నిర్ణయించి, భళ్లాలదేవుడిని సైన్యాధ్యక్షుడిగా నియమించింది రాజమాత శివగామి. ఇప్పుడు రెండో పార్ట్ లో శివగామి రోల్ ఎలాంటి క్యూరియాసిటీనిస్తుందో చూడాలి.