Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో అర్ధరాత్రి రాజమౌళి షాకిచ్చాడు
By: Tupaki Desk | 19 April 2022 4:26 AM GMTదర్శకధీరుడు రాజమౌళి ఏది చేసినా చాలా క్రియేటివిటీగానే చేస్తారు. ఆయన చర్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. దేశం గర్వించే దర్శకుడు అయినా సరే చాలా సింపుల్ గానే జనాల్లోకి వెళుతారు. అందరితో కలిసిపోతారు. ఒక సామాన్యుడిలానే ప్రవర్తిస్తారు. తాజాగా మరోసారి ఆశ్చర్యపరిచాడు.
హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి జక్కన్న పర్యటించారు. ఓ సాధారణ వ్యక్తిగా రాజమౌళి నైట్ బజార్ అందాలను తిలకరించారు. నైట్ బజార్ మొత్తం తిరిగిన రాజమౌళి స్థానిక ప్రజలతో కలిసి సంభాషించారు. హోటల్ లో కూడా తన కుమారుడు కార్తికేయతో కలిసి బిర్యానీ తిని వెళ్లిపోయారు.
సాధారణ వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోవడంతో పాతబస్తీ ప్రజలు ఎవరూ రాజమౌళిని గుర్తుపట్టలేకపోయారు. హోటల్ నుంచి వెళ్లే సమయంలో కొంతమంది ఆయన గడ్డం చూసి రాజమౌళి లాగా ఉన్నాడని దగ్గరికి వెళ్లి ఆరాతీశారు.
'సార్ మీరు రాజమౌళి డైరెక్టర్ గారు కదా' అని అడిగారు. దీంతో అవును అనడంతో సెల్ఫీల కోసం స్థానికులు పోటీపడ్డారు. అక్కడున్న చాలా మంది పాతబస్తీ యువకులు రాజమౌళితో సెల్ఫీలు దిగారు.
రంజాన్ మాసం కావడంతో చార్మినార్ అంతా ముస్లింలతో వారి కొనుగోళ్లతో సందడిగా మారింది. ఇక రాత్రిళ్లు మాత్రమే వాళ్లు భోజనం చేస్తారు కాబట్టి ఎన్నో వెరైటీ వంటకాలు చార్మినార్ ప్రాంతంలో వండారు. అద్భుతమైన ఆ రుచులను చవిచూడడానికే రాజమౌళి , తన కుమారుడితో వచ్చాడు.
ఈ క్రమంలోనే సాధారణ వ్యక్తిలా మొత్తం కలియతిరిగి ఇలా తన ముచ్చట తీర్చుకున్నారు. అంత పెద్ద డైరెక్టర్ ను అక్కడ ఎవరూ గుర్తుపట్టకపోవడం విశేషమనే చెప్పాలి.