Begin typing your search above and press return to search.
ఇదీ RRR మూల కథ అంటున్న జక్కన్న
By: Tupaki Desk | 29 March 2020 6:12 AM GMTకరోనా కారణంగా భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో అత్యావసరమైన సేవలు అందించే రంగాలు తప్ప మిగతా అన్నీ ఆగిపోయాయి. సినీ రంగం సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఈ సమయంలో ఏమాత్రం యాక్టివిటీ లేకుండా ఉన్నప్పుడు రాజమౌళి టీం తమ సినిమా ప్రచారాన్ని టేకప్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశాయి. మొదట మోషన్ పోస్టర్ - టైటిల్ ను విడుదల చేసిన జక్కన్న టీమ్ 27 వ తారీఖున చరణ్ జన్మదినం సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అంటూ చరణ్ పాత్ర ఇంట్రో వీడియో ను విడుదల చేశారు.
ఎప్పటిలాగే ఈ వీడియోకు భారీ స్పందన దక్కుతోంది. దీంతో పాటుగా సినిమా కథ ఏమై ఉంటుందా అనే కొన్ని ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. రాజమౌళి గతంలో కూడా 'RRR' థీమ్ ఇది అంటూ వెల్లడించారు కానీ 'భీమ్ ఫర్ రామరాజు' వీడియో విడుదలైన తర్వాత చరణ్ వస్త్రధారణ పోలీసు యూనిఫాం లో ఉండడం.. అల్లూరి పాత్ర కాషాయ వస్త్రాలలో షర్టు లేకుండా ఉంటుంది అలా కాకుండా భిన్నంగా ఉండడంతో జనాల్లో కథపై కొత్త సందేహాలు వచ్చాయి.
ఈ విషయంపై రాజమౌళిని ప్రశ్నించినప్పుడు ఆయన సినిమా మూల కథ ఇదీ అంటూ స్టోరీ చెప్పారు. "అల్లూరి సీతారామరాజు.. కొమరం భీమ్ నిజ జీవితంలో ఒకరినొకరు కలవలేదు. అయితే వారిద్దరికీ కొన్ని పోలికలు ఉన్నాయి. వారిద్దరూ ఇరవైల వయసులోనే ఇంటినుంచి బయటకు వచ్చారు. బ్రిటిష్.. నిజాం పాలన కు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. ఇద్దరి జీవితంలో జరిగిన పలు ముఖ్యమైన ఘట్టాలను కలిపి మేము RRR రూపొందించాం. 1920 లో ఇద్దరు స్నేహితులు చెడుకు వ్యతిరేకంగా చేసినపోరాటమే RRR మూల కథ" అంటూ జక్కన్న వెల్లడించారు.