Begin typing your search above and press return to search.
తెలుగు మీడియా లైట్ అంటున్న జక్కన్న?
By: Tupaki Desk | 25 April 2017 6:51 AM GMTమిగిలిన వారితో పోలిస్తే.. తమకేదైనా జరిగితే.. వెనువెంటనే రియాక్ట్ అయ్యే మీడియా.. గడిచిన కొద్దిరోజులుగా తమకు ఎదురవుతున్న అవమానాల్ని గుండెల్లో పెట్టుకొని భరిస్తోందట. రోజులు గడుస్తున్న కొద్దీ.. అవి అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఇప్పుడు భరించలేని స్థాయికి వెళ్లిన వైనం ఇప్పుడు మీడియా రంగంలోనే కాదు.. టాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకూ తెలుగు మీడియాను.. మీడియా ప్రతినిధులను అంతగా అవమానిస్తున్నది ఎవరో కాదు.. ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి అలియాస్ జక్కన్నగా చెబుతున్నారు. రాజమౌళి గొప్ప దర్శకుడన్న విషయంలో నో డౌట్. ఆ మాటకువస్తే.. ఆయన్ను తెలుగు మీడియా నెత్తిన పెట్టుకుందే కానీ.. ఎప్పుడూ.. ఎక్కడా తగ్గించింది లేదు. ఆ మాటకు వస్తే.. కర్ణాటకలో బాహుబలి మూవీకి వ్యతిరేకంగా జరుగుతున్న రచ్చను ప్రముఖంగా చెప్పటం ద్వారా.. బిజీబిజీగా ఉన్న రాజమౌళి అటెన్షన్ పడేలా చేసి.. ఆ ఇష్యూను యుద్ధప్రాతిపదికన క్లోజ్ చేయించింది కూడా తెలుగు మీడియానే.
అంతేనా.. బాహుబలి సినిమాను తెలుగు ప్రైడ్‌గా మార్చటంతో పాటు.. ఆ సినిమాకు తెలుగు మీడియా చేసిన ప్రచారాన్ని రూపాయిల్లో లెక్కేస్తే.. దాదాపు వెయ్యి కోట్లకు పైనే అవుతుంది. సినిమా బడ్జెట్ కు మించి ఏళ్ల తరబడి ఒక సినిమాకు పతాక శీర్షికల్లో ప్రాధాన్యత ఇచ్చిన వైనం మరే సినిమాకు దక్కలేదని చెప్పాలి. ఎందుకిలా అంటే.. ఒక తెలుగోడు తీసిన సినిమా అన్న సాఫ్ట్ కార్నర్ ఒకటైతే.. తెలుగోడి గొప్పన్న ప్రపంచానికి చాటేందుకు చేస్తున్న ప్రయత్నానికి అందరం ఎవరి వంతు సాయం వారు చేయాలన్న ఆలోచనే.
ఈ కారణంతోనే.. బాహుబలి 1 సినిమా విడుదల సందర్భంగా.. ఎప్పుడూ లేని ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒకటి తెలుగు మీడియా సర్కిల్స్‌లో రౌండ్స్ కొట్టింది. సినిమా ఒక మోస్తురుగా ఉన్నా.. బాగుందన్న మాటనే రాయాలని.. లేకుంటే.. ఇలాంటి భారీ ప్రయత్నాలు భవిష్యత్తులో జరగవని ఫీలైన మీడియా ప్రతినిధులు.. మీడియా సంస్థలు చాలానే ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే.. రాజమౌళి మీద ఉన్న అభిమానం.. ఆయన చేస్తున్న సాహసానికి అండగా నిలవాలనే. మరింత మంది అభిమానాన్ని పొందిన రాజమౌళి.. వారికితిరిగి ఇస్తున్నది చూసినప్పుడు ఒళ్లు మండాల్సిందే.
బాహుబలి 2 విడుదల నేపథ్యంలో తెలుగు మీడియా విషయంలో రాజమౌళి అనుసరిస్తున్న వైఖరిపై.. అందరిలో భారీ అసంతృప్తి ఉన్నట్లుగా చెప్పక తప్పదు. అయితే.. తెలుగువాడి ప్రయత్నాన్ని దెబ్బ తీయకూడదన్న ఉద్దేశంతో నెగిటివ్ గా ఎక్కడా ప్రచారం చేయని పరిస్థితి. అయితే.. మీడియాకు.. మీడియా ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నాలకు భిన్నంగా జక్కన్న టీం వ్యవహరిస్తోందన్న మాట వినిపిస్తోంది. వాస్తవానికి బాహుబలికి ఇప్పుడిస్తున్న ప్రచారానికి రెట్టింపు ప్రచారం జరగాల్సి ఉంది. కానీ.. రాజమౌళి టీం అనుసరిస్తున్న తీరుతో.. విసిగిపోయిన మీడియా ప్రతినిధులు.. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వార్తలు ఇవ్వాల్సి వస్తోందంటున్నారు.
తెలుగు మీడియాకు చెందిన ఎవరిని రాజమౌళి పట్టించుకోవటం లేదని.. ఆయన సమయాన్ని నేషనల్ మీడియాలో ఫోకస్ చేయటానికే వెచ్చిస్తున్నారే తప్పించి.. లోకల్ మీడియాను అస్సలు ఖాతరు చేయటం లేదన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న వేళ.. రాజమౌళి పెడుతున్న పరీక్షలతో మీడియా సంస్థలు.. వారి ప్రతినిధులు పడుతున్న కష్టాలు అన్నిఇన్ని కావంటున్నారు. సినిమాకు సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూలు అడిగినా.. టైం అడిగినా.. తమకు లేదంటున్న రాజమౌళి అండ్ కో.. నేషనల్ మీడియా విషయంలో మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. తన ఇమేజ్ గ్రాఫ్ ను భారీగా పెంచేసిన తెలుగు మీడియాను లైట్ అంటున్న రాజమౌళి.. తాను చేస్తున్న తప్పును సరిదిద్దుకోవాలన్న మాట పలువురు మీడియా ప్రతినిధుల నోట.. చిత్రపరిశ్రమకు చెందిన వారి నోట వినిస్తుండటం గమనార్హం. ఇందులో నిజానిజాల మీద రాజమౌళి ఒక కన్నేసి.. గ్యాప్ ఎక్కడ ఉందన్న విషయాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ఆయన శ్రేయోభిలాషులు. నేషనల్ మీడియాను మాత్రమే ఎంటర్ టైన్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్న వేళ.. జక్కన్నకు ఈ మెసేజ్ ఎంతవరకూ చేరుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/