Begin typing your search above and press return to search.
అన్నయ్య కోసం రాజమౌళి ప్రయాణం
By: Tupaki Desk | 6 July 2019 7:49 AM GMTఆర్ ఆర్ ఆర్ పనుల్లో విపరీతమైన ఒత్తిడి మధ్య బిజీగా ఉన్న రాజమౌళి చెప్పాపెట్టకుండా అమెరికా వెళ్లడం చూసి అందరూ తానా సభల కోసమే అనుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సహా ఎందరో సెలెబ్రిటీలు హాజరవడం అందులోనూ అన్నయ్య కీరవాణి మ్యూజికల్ నైట్ ఉండటం లాంటి కారణాల వల్ల జక్కన్న నిర్వాహకుల ఆహ్వానం మేరకు వెళ్లి ఉండవచ్చనే ప్రచారం జరిగింది.
అయితే నిజానికి జరిగింది వేరని తెలుస్తోంది. ఆ మేరకు రాజమౌళి వ్యక్తిగత పనుల మీద అమెరికా వచ్చాను తప్ప తానా సభల కోసం కాదని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చినప్పటికీ అందులో కారణాన్ని ప్రస్తావించలేదు. అందుకే అనుమానాలు అలాగే ఉండిపోయాయి. విశ్వసనీయ సమాచారం మేరకు రాజమౌళి వెళ్ళింది కీరవాణి పుట్టిన రోజు వేడుకలు సెలెబ్రేట్ చేసుకోవడానికట. కుటుంబ సభ్యులతో సహా వెళ్లి కేట్ కట్ చేయడంతో పాటు గ్రాండ్ పార్టీ ఒకటి ఆర్గనైజ్ చేశాడట.
ఇదంతా అన్నయ్య మీద ఎంత ప్రేమాభిమానాలు ఉంటే తప్ప చేయరు కదా. రాజమౌళి సినిమా ప్రయాణంలో కీరవాణి పాత్ర చాలా కీలకం. మొదటి మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదలుకుని టాలీవుడ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన బాహుబలి దాకా మ్యూజిక్ కంపోజ్ చేసింది ఆయనే. అందుకే ఈ స్పెషల్ సెలెబ్రేషన్ జరగాల్సిందే. ఆర్ఆర్ఆర్ కు వారం రోజులు బ్రేక్ ఇచ్చిన కారణం కూడా ఇదేనట