Begin typing your search above and press return to search.
రాజమౌళి మళ్లీ మొదలుపెట్టాల్సిందే
By: Tupaki Desk | 28 Jan 2022 11:30 PM GMTదర్శకధీరుడు రాజమౌళి మళ్లీ మొదలుపెట్టాల్సిందే అంటున్నారు. కారణం జనవరి 7న వరల్డ్ వైడ్ గా `ఆర్ ఆర్ ఆర్` అత్యంత భారీ స్థాయిలో దాదాపు 14 భాషల్లో విడుదల అవుతుందని అంతా ఎదురుచూశారు. ఇందు కోసం ప్రమోషన్స్ కు 20 కోట్లు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ హోరెత్తించారు. స్వయంగా ప్రచార పర్వాన్ని కూడా రాజమౌళి తానే డిజైన్ చేసి స్టార్స్ వెంట వుండి నడిపించారు. బాలీవుడ్ లో వారం రోజుల పాటు ప్రత్యేకంగా మకాం వేసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అక్కడ ఏ మీడియానీ వదల కుండా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. కపిల్ శర్మ షోలోనూ చివరికి ప్రో కబడ్డీ, ఫుట్ బాల్ గేమ్ ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొని `ఆర్ ఆర్ ఆర్` ప్రచారాన్ని పీక్స్‌కి తీసుకెళ్లారు. అంత చేసినా సినిమా రిలీజ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. తాజాగా `ఆర్ ఆర్ ఆర్` కోసం రెండు రిలీజ్ డేట్ లని ప్రకటించారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టుగా `ఆర్ ఆర్ ఆర్` చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించారు.
పరిస్థితుల్లో మార్పులు మొదలై థియేటర్ల వద్ద సాధారణ స్థితి ఏర్పడితే మార్చి 18న రిలీజ్ చేయాలని, లేదంటే ఏప్రిల్ 28 వరకు ఎలగూ పరిస్థితులు మారతాయి కాబట్టి ఆ రోజుని పికప్ చేసుకుంటే బాగుంటుందని రెండు డేట్ అని ఫిక్సయ్యారు. దీంతో మళ్లీ సరికొత్తగా మూవీ ప్రమోషన్స్ ని మరింత ఫ్రెష్ గా ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారట. ఇందు కోసం సరికొత్త ప్రణాళికని కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది.
అయితే గతంలో ప్రచార పర్వంలో భారీ స్థాయిలో సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని బయటపెట్టారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న ప్రమోషన్స్ లో లిమిటెడ్ గానే వుండాలని, సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా రివీల్ చేయకూడదని రాజమౌళి భావిస్తున్నారట. ఎక్కడా కంటెంట్ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రమోషన్స్ ని నిర్వహించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో జరిగిన ప్రమోషన్స్ లో అత్యధికంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా మాత్రమే పాల్గొన్నారు. త్వరలోప్రారంభం కానున్న ప్రమోషన్స్ లో కేవలం హీరోలు మాత్రమే పాల్గొంటారని, అది కూడా చాలా తక్కువ అని చెబుతున్నారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని రెండు డేట్ లని రిజర్వ్ చేసుకున్నారు అయితే ఈ డేట్ ల వల్ల సినిమాకు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. కారణం ఇదే సమయంలో ఇర క్రేజీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేఫథ్యంలో వచ్చే నెల రిలీజ్ డేట్ లపై ఓ స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం వుందని తెలిసింది.