Begin typing your search above and press return to search.

జపాన్ పాపులర్ గేమింగ్ స్టూడియోలో రాజమౌళి..!

By:  Tupaki Desk   |   21 Oct 2022 5:20 AM GMT
జపాన్ పాపులర్ గేమింగ్ స్టూడియోలో రాజమౌళి..!
X
బాహుబలితోనే వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి RRR తో మరోసారి తన సత్తా చాటారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి తన పేరుని మరింత బలంగా వినిపించేలా చేయగా లేటెస్ట్ గా ఈ మూవీ జపాన్ లో రిలీజ్ చేసి తన స్టామినా చూపించాలని చూస్తున్నారు.

రిలీజ్ ప్రమోషన్స్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్, రాజమౌళి ముగ్గురు జపాన్ మీడియాలో హాట్ న్యూస్ గా మారారు. ఇదేకాకుండా రాజమౌళి ప్రత్యేకంగా ఓ గేమింగ్ స్టూడియోకి వెళ్లారు. మెటల్ గేర్ లాంటి అద్భుతమైన వీడియో గేమ్ ని సృష్టించిన హిడియోం కొజిమాని కలిసేందుకు స్టూడియోకి వెళ్లారు రాజమౌళి.

ఎలాగు వచ్చాడనో లేక ముందుగానో ప్లానో తెలియదు కానీ ఈ ప్రాసెస్ లో రాజమౌళి బాడీ మొత్తాన్ని రకరకాల కెమెరాలతో స్కాన్ చేశారు హిడియో కోజిమా. RRR పాత్రలతో ఓ గేమ్ ని ఏదైనా సిద్ధం చేస్తున్నారా అన్న డౌట్ వచ్చింది. అందుకే రాజమౌళి బాడీని స్కాన్ చేసి ఉంటారని చెబుతున్నారు.

ప్రస్తుతం రాజమౌళి హిడియో కోజిమా స్టూడియోలో కెమెరాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆర్.ఆర్.ఆర్ గేం వస్తే మాత్రం తప్పకుండా అది సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఆ గేమ్ లో రాజమౌళి కూడా ఉంటాడు కాబట్టే ఆయన బాడీని స్కాన్ చేసి ఉంటారని చెబుతున్నారు.

అంతకుముందు బాహుబలి సినిమా టైం లో కూడా బాహుబలి గేమ్ ఒకటి ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అది ఇప్పటివరకు జరగలేదు. ఆర్.ఆర్.ఆర్ గేమ్ అయినా వస్తుందా రాదా అన్నది చూడాలి.

ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ కి జపాన్ వెళ్లిన ఎన్.టి.ఆర్, రాం చరణ్ లకు అక్కడ ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. మన వాళ్లు కూడా హాలీవుడ్ స్టార్స్ రేంజ్ కి వెళ్లారని తెలుగు ఆడియన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. జపాన్ లో ఈరోజు రిలీజ్ అవుతున్న RRR మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే మాత్రం రాజమౌళి ఇక మీదట తన సినిమాలన్ని డైరెక్ట్ గా జపాన్ రిలీజ్ ప్లాన్ చేస్తారని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.