Begin typing your search above and press return to search.

లండన్ లో రాజమౌళి ఏం చేస్తున్నాడంటే

By:  Tupaki Desk   |   2 May 2017 1:24 PM GMT
లండన్ లో రాజమౌళి ఏం చేస్తున్నాడంటే
X
బాహుబలి2 రిలీజ్ కోసం అందరి కంటే ఎక్కువగా ఎదురుచూసిన వ్యక్తిగా రాజమౌళి పేరే చెప్పాలి. మూవీ కోసం తన శక్తి యుక్తులు.. మేథో సంపత్తిని ఎంతో ఉపయోగించిన రాజమౌళి.. అంతకు మించిన కాలాన్ని కూడా వెచ్చించాడు. దాదాపు ఆరేళ్ల సమయాన్ని ఒక ప్రాజెక్ట్ కోసమే కేటాయించాడు.

ఇప్పుడు దర్శకధీరుడు లండన్ వెళ్లడంతో.. బాహుబలి2 సక్సెస్ ను ఎంజాయ్ చేసేందుకే అని అంతా అనుకున్నారు. అయితే.. జక్కన్న లండన్ టూర్ అందుకు కాదు. ఈ దర్శకుడితో పాటు.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. అనుష్క.. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా లండన్ వెళ్లారు. ఈ డీటైలింగ్ తో రాజమౌళి టూర్ వెనక కారణం ఏంటో అర్ధమైపోతుంది. ఇంకా బాహుబలి ప్రాజెక్టును తన తలపై నుంచి దించుకోలేదు రాజమౌళి. బ్రిటిష్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో బాహుబలి ది కంక్లూజన్ ను స్పెషల్ స్క్రీనింగ్ చేస్తుండగా.. అక్కడ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ చేసుకునేందుకే రాజమౌళి అండ్ టీం లండన్ లో తేలారు.

ఇప్పుడప్పుడే రిలాక్స్ అయ్యే మూడ్ లో లేడట రాజమౌళి. బాహుబలి2 మూవీతో.. ఇప్పట్లో ఎవరూ అందుకోలేని స్థాయిలో రికార్డులు సృష్టించాకే.. జక్కన్న బ్రేక్ తీసుకుంటాడని సన్నిహితులు చెబుతున్నారు. బాహుబలి2 హంగామా అంతా పూర్తయ్యాక.. తన ఫ్యామిలీతో కలిసి కొన్ని నెలల పాటు భూటాన్ లో గడపాలన్నది రాజమౌళి ఆలోచన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/