Begin typing your search above and press return to search.
రాజమౌళికి ‘కార్తికేయ’ స్ఫూర్తినిచ్చిందా?
By: Tupaki Desk | 16 Dec 2017 6:57 AM GMTఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో శాశన సభ నిర్మాణంలో భాగంగా రాజమౌళి ప్రతిపాదించిన తెలుగు తల్లి-తొలి కిరణం కాన్సెప్ట్ సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశమైంది. సినిమాల విషయంలో రాజమౌళి చూపించే భారీ విజన్ ఇక్కడ కూడా ప్రస్ఫుటమైంది. సూర్య కిరణాల్ని అద్దాల ద్వారా అసెంబ్లీ భవనం లోపలికి రిఫ్లెక్ట్ చేయించి తెలుగు తల్లి విగ్రహం పాదాల్ని తాకేలా చేయాలన్న రాజమౌళి ఆలోచన చాలామందిని ఆకట్టుకుంది. రాజమౌళి విజనే విజనబ్బా అంటూ నెటిజన్లు ఆయన్ని పొగిడేస్తున్నారు. ఐతే రాజమౌళి ఈ ఆలోచనకు ఒక చిన్న సినిమా స్ఫూర్తిగా నిలిచిందంటూ సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం విశేషం. ఆ సినిమా మరేదో కాదు.. ‘కార్తికేయ’.
యువ దర్శకుడు చందూ మొండేటి తొలిసారి మెగా ఫోన్ పట్టి తీసిన ‘కార్తికేయ’లో రాజమౌళి చూపించినట్లే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సినిమాలో అది కీలక సన్నివేశంలో వస్తుంది. రాజమౌళి కాన్సెప్ట్ చూసిన వాళ్లు ఆ సన్నివేశాన్నే గుర్తు చేసుకుంటున్నారు. రాజమౌళి అప్పట్లో ‘కార్తికేయ’ సినిమా బాగా నచ్చింది. ఆ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. ఐతే నిజంగా రాజమౌళి ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందాడా లేక యాదృచ్ఛికంగా తను కూడా అలాగే ఆలోచించాడా అన్నది తెలియదు కానీ.. రాజమౌళికి స్ఫూర్తినిచ్చిన గుడి గురించి మాత్రం నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.