Begin typing your search above and press return to search.

ఆ హీరోల గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం : జక్కన్న

By:  Tupaki Desk   |   21 Nov 2018 6:59 AM GMT
ఆ హీరోల గురించి మాట్లాడితే ఏం ప్రయోజనం : జక్కన్న
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి క్రేజ్‌ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే టాప్‌ దర్శకుల జాబితాలో రాజమౌళి చేరాడు. అంతటి గుర్తింపు ఉన్న రాజమౌళి మంచి వక్త కూడా అనే విషయం తెల్సిందే. తాజాగా రాజమౌళి ఒక కాలేజ్‌ ఈవెంట్‌ లో పాల్గొన్నారు. ఆసమయంలో విద్యార్థిని విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో చాలా విభిన్నంగా సమాధానాలు చెప్పాడు. విద్యార్థులకు ఎన్నో తెలియని విషయాలను చెప్పడంతో పాటు, వారిని ఇన్సిఫైర్‌ చేయడం జరిగింది. విద్యార్థులు అడిగిన కొన్ని ప్రశ్నలకు జక్కన్న సమాధానాలు ఇవే..

ప్రశ్న : మీ సక్సెస్‌ సీక్రెట్‌ ఏంటీ?

సమాధానం : సక్సెస్‌ సీక్రెట్‌, సక్సెస్‌ మంత్రాలు అంటూ ఏమీ ఉండవు. అలాంటివే ఉంటే అంతా కూడా వాటిని పట్టుకుని సక్సెస్‌ లు తీస్తూనే ఉంటారు. సక్సెస్‌ అనేది మనం కష్టపడితే వచ్చేది. ఏ పని చేసినా కష్టపడి చేయడం, చివరి క్షణంలో కింద పడిపోతున్నాం అనే సమయంలో కూడా కష్టపడుతూనే ఉంటే తప్పకుండా సక్సెస్‌ అనేది వస్తుంది.

ప్రశ్న : దర్శకుడు అవ్వాలనే థాట్‌ ఎలా వచ్చింది?

సమాధానం : నాకు సడన్‌ గా డైరెక్టర్‌ అవ్వాలనే థాట్‌ ఏమీ రాలేదు. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటున్నాను అంటూ ఇంట్లో వాళ్లు తిడుతూ ఉంటే ఎడిటింగ్‌ అసిస్టెంట్‌ గా జాయిన్‌ అయ్యాను. ఆ సమయంలోనే సినిమాలపై ఆసక్తి కలిగింది. సినిమా కథల గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గర రైటింగ్‌ అసిస్టెంట్‌ గా జాయిన్‌ అయ్యాను. అప్పుడు యాక్షన్‌ సీన్స్‌ రాసే వాడిని. కాని నేను రాసిన యాక్షన్‌ సీన్స్‌ - సినిమాలో మరో విధంగా ఉండేవి. అందుకే నేను రాసేదాన్ని - నేను అనుకునేదాన్ని ప్రేక్షకులకు చూపించాలి అంటే సినిమాను నేనే డైరెక్ట్‌ చేయాలని నిర్ణయించుకున్నాను - అందుకే దర్శకుడిని అయ్యాను అన్నాడు.

ప్రశ్న : మీతో సినిమా చేస్తే హీరోల స్టార్‌ డం మారుతుంది - దీనిపై మీ స్పందన?

సమాధానం : నేను సినిమా చేసే సమయంలో వారి స్టార్‌ డం గురించి చూడను, నాకు కావాల్సిన విధంగా వారు ఉన్నారా లేదా అనేది చూస్తాను. తర్వాత స్టార్‌ డం అలా వచ్చేస్తుందంతే అన్నాడు.

ప్రశ్న : ప్రభాస్‌ గురించి ఒక్క మాట చెప్పండి

సమాధానం : ప్రభాస్‌ - ఎన్టీఆర్‌ - పవన్‌ - చరణ్‌ ఇలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కాని వారి గురించి మాట్లాడితే మీకు ఏ విధంగా ప్లస్‌ అవుతుంది. మీరు రాసుకునే సక్సెస్ మంత్రంలో నేను వారి గురించి మాట్లాడే మాటలు ఎలా ఉపయోగపడతాయి అన్నాడు. ఆ తర్వాత ప్రభాస్‌ నాకు మంచి మిత్రుడు - ప్రతి విషయంలో కష్టపడే తత్వం ఉంది. గ్రౌడ్‌ టు ఎర్త్‌ వ్యక్తిత్వం. ప్రభాస్‌ నుండి కష్టపడే తత్వంను మీరు నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు.

ప్రశ్న : మీకు భయంగా ఉంటుందా?

సమాధానం : ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను. నేను చేసే సినిమా ఎలా ఉంటుందో అనే భయం నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కొసారి నా సినిమా ప్రపంచ రికార్డులన్నీంటికి బద్దలు కొడుతుందని అనిపిస్తుంది. మరోసారి మొదటి రోజే థియేటర్ల తీసేస్తారా అనే భయం కూడా ఉంటుంది అన్నాడు.

ప్రశ్న : మీకు ఇన్సిపిరేషన్‌ ఎవరు?

నాకు ఎంతో మంది ఇన్సిపిరేషన్‌ ఉన్నారు. సైకిల్‌ పై పచ్చళ్లు పెట్టుకుని అమ్మి వ్యాపార సామ్రాజ్యంను నెలకొల్పిన వ్యక్తి రామోజీ రావు అంటే నాకు చాలా ఇన్సిపిరేషన్‌. జయప్రకాష్‌ గారు అన్నా కూడా నాకు చాలా ప్రత్యేకమైన గౌరవం అన్నాడు.