Begin typing your search above and press return to search.
రాజమౌళి మరోసారి ఆ తప్పు చేయబోతున్నారా...?
By: Tupaki Desk | 8 July 2020 1:00 PM GMTభారతదేశం గర్వించదగ్గ దర్శకులలో రాజమౌళి ఒకరు. 'బాహుబలి' చిత్రాలతో మన తెలుగు సినిమాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకొనిపోయాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ టెక్నీషియన్ నటీనటులు కోరుకుంటాడు. టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న దర్శకధీరుడు రాజమౌళి తన ఆలోచలను సినిమాలుగా మలిచి విజువల్ వండర్స్ క్రియేట్ చేస్తుంటాడు. అందుకే సినీ అభిమానులు అతన్ని 'జక్కన్న' అని పిలుచుకుంటూ ఉంటారు. కాగా తన దర్శకత్వ ప్రతిభతో 'దర్శకధీరుడు' అని పేరు తెచ్చుకున్న రాజమౌళి ప్రొడ్యూసర్ గా మారి సినిమా కూడా నిర్మించాడు. దాదాపు సినీ అభిమానులు అందరూ ఈ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు.
రాజమౌళి - ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు రూపొందగా నాల్గవ సినిమా 'ఆర్.ఆర్.ఆర్' రాబోతోంది. వీరి కాంబోలో వచ్చిన 'యమదొంగ' మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి రాజమౌళి నిర్మాతగా కూడా వ్యవహరించారు. రమా రాజమౌళి సమర్పణలో విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి రాజమౌళి 'యమదొంగ' సినిమా నిర్మించాడు. ఈ సినిమా హిట్ అయినప్పటికీ ఈ ప్రొడక్షన్ హౌస్ లో ఉన్న కొందరు చేతి వాటం చూపించడంతో రాజమౌళి అండ్ కో కి సినిమా కోసం పెట్టిన డబ్బులు వెనక్కి రాలేదని అప్పట్లో ఇండస్ట్రీలో టాక్ నడిచింది. దీంతో విశ్వామిత్ర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ మరుగున పడిపోయింది. ఆ తర్వాత రాజమౌళి 'అందాల రాక్షసి' సినిమాకి సాయి కొర్రపాటి తో కలిసి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. అయితే ఈ సినిమా విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందలేదు.
ఇండస్ట్రీలోని నమ్మదగిన వ్యక్తుల సమాచారం ప్రకారం ఇప్పుడు రాజమౌళి మళ్లీ తన సొంత నిర్మాణ సంస్థకు బూజు దులిపే పనిలో ఉన్నాడట. ఈ మధ్య వెబ్ సిరీస్ లు మరియు ఒరిజినల్ సినిమాలకు ఆదరణ లభిస్తుండటంతో రాజమౌళి ప్రొడక్షన్ లోకి దిగే ఆలోచన చేస్తున్నాడట. దీనికి తోడు ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ ఒకేసారి సింగిల్ పేమెంట్ మోడ్ లో డబ్బులు చెల్లించడానికి ముందుకు వస్తుండటంతో తానే సొంతగా కొన్ని ఒరిజినల్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లు నిర్మించి డైరెక్ట్ ఓటీటీ రిలీజులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ వారాల్లో నిజా నిజాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ ఇప్పటికే 70 శాతం కంప్లీట్ అయింది. స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై యావత్ సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో 'అల్లూరి సీతారామరాజు'గా రామ్ చరణ్.. 'కొమరం భీమ్'గా ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.