Begin typing your search above and press return to search.
జక్కన్న ఆస్కార్ కోసం ఎక్కడా తగ్గడం లేదే!
By: Tupaki Desk | 25 Nov 2022 2:30 AM GMTఈ సారి తప్పితే మళ్లీ అవకాశం రాదు అన్నట్టుగా రాజమౌళి ఆస్కార్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కించిన `RRR` మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా దర్శకుడిగా రాజమౌళికి ఊహించని పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఎంతలా అంటా హాలీవుడ్ స్టార్స్, మేకర్స్ కూడా రాజమౌళి కనిపిస్తే తనతో ఫొటోలకు పోజులిచ్చేంత. వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
అంతే కాకుండా ప్రఖ్యాత ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన హిందీ వెర్షన్ తో ఈ మూవీ హాలీవుడ్ స్టార్ లకు చేరువైంది. ఇందులో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్.. స్కాట్ బంగ్లాలో మల్లి ని విడిపించడం కోసం జంతువుల వ్యాన్ తో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశం హాలీవుడ్ స్టార్ లతో పాటు విదేశీ ప్రేక్షకుల్ని సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ రీసెంట్ గా జపాన్ లోనూ భారీ స్థాయిలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
అక్కడ కూడా `RRR` మూవీ రికార్డులు సృష్టిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా వుంటే `RRR` మూవీని ఆస్కార్ బరిలో నిలపాలని దర్శకుడు రాజమౌళి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇందు కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సారి తప్పితే మళ్లీ ఛాన్స్ రాదు అనే స్థాయిలో గట్టి పట్టుదలతో వచ్చే ఏడాది జరగనున్న అకాడమీ అవార్డ్స్ లో `RRR` నామినేట్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్కార్ అకాడమీకి చెందిన మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రొఫెషనల్స్ ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట.
ఇందు కోసం రాజమౌళి కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో రాజమౌళికి ఓ బలమైన ఆయుధం లభించినట్టుగా తెలుస్తోంది. చాలా వరకు సినిమాలు ఆస్కార్ బరికి ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంట్రీని సాధిస్తుంటాయి. ఇప్పడు దాన్నే ఆయుధంగా చేసుకుని జక్కన్న `RRR`ని ఆస్కార్ బరిలో దించాలని ప్లాన్ చేసుకుంటున్నాడట. ఈ ప్లాన్ లో భాగంగానే ఆస్కార్ ఓటింగ్ కు అర్హలైన బృందాలకు రాజమౌళి `RRR` ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయిస్తున్నాడు.
అంతే కాకుండా ప్రతీ అవార్డ్ ఫంక్షన్ లో `RRR` హాట్ టాపిక్ గా మారేలా చూస్తున్నాడు. పలువురు నటీనటులు, టెక్నిషియన్ లతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతూ `RRR`ని ప్రత్యేకంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రత్యేక ఓటింగ్ కోసం దాదాపు వెయ్యి మందికి పైగా సభ్యులు వున్నారట. వారిని ప్రసన్నం చేసుకునే క్రమంలో రాజమౌళి దాదాపుగా 50 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.