Begin typing your search above and press return to search.
కమల్ హాసన్ మాటను నిజం చేస్తున్న జక్కన్న
By: Tupaki Desk | 3 Dec 2022 4:30 AM GMTటాలీవుడ్ లో అజేయుడిగా వరుస విజయాలతో జైత్రయాత్ర సాగిస్తున్న ఏకైక దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. ఇప్పుడు అతడు దేశంలోనే నంబర్- 1 దర్శకుడిగా ఐడెంటిటీని సంపాదించుకున్నారు. దక్షిణాది నుంచి అతడి అసాధారణ ప్రయాణం గురించి దేశవిదేశాల్లో చర్చ సాగుతోంది. పాన్ ఇండియా ట్రెండ్ ని పాన్ వరల్డ్ రేంజుకు విస్తరిస్తూ టాలీవుడ్ ఖ్యాతిని వినువీధుల్లో ఇనుమడింపజేస్తున్నారు. ఇక ఆస్కార్ లకే పాఠాలు నేర్పాలి అన్న కమల్ హాసన్ మాటను నిజం చేసేందుకు మన జక్కన్న అసాధారణంగా ప్రయత్నిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు.
ఒక్కో మెట్టు ఎక్కే కొద్దీ అతడి ఆలోచనల పరిధి విశాలంగా మారుతోంది. అందుకు తగ్గట్టే కఠోరమైన తపస్సు చేస్తూ విజయశిఖరాల్ని అధిరోహిస్తున్నాడు. బాహుబలి ఫ్రాంఛైజీతో ఇండియన్ సినిమా రూపురేఖల్నే మార్చేసిన ఘనాపాటి అయిన జక్కన్నకు సాహో అనని హీరో నిర్మాత నేడు దేశంలో లేడు అంటే అతిశయోక్తి కానేకాదు. ఇటీవల రాజమౌళి RRR తో మరో సంచలన విజయం అందుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం కరోనా కష్ట కాలంలో రాజమౌళి పోరాడిన తీరు ఆసక్తికరం. శ్రమ ఎప్పుడూ వృధా పోదు. ఏదో ఒక రూపంలో రిటన్ గిఫ్ట్ లా అందుతుంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దాదాపు 1200 కోట్లు వసూలు చేయడమే గాక.. ఆస్కార్ గమ్యస్థానాన్ని చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు సాగించడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ఆస్కార్ బరిలో ముందుకు తెస్తూ.. గత కొన్ని వారాలుగా రాజమౌళి అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. దీంతో అంతర్జాతీయ జ్యూరీలో ఈ చిత్రం కాస్త సందడి చేస్తోంది.
జనవరిలో ఆస్కార్ ల ప్రకటనలకు ముందే ఆర్.ఆర్.ఆర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతలోనే RRR కోసం రాజమౌళి ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును గెలుచుకున్నారనేది తాజా వార్త. RRR కోసం ఉత్తమ దర్శకుడు అవార్డును మన జక్కన్న గెలుచుకున్నారు. కొద్దిసేపటి క్రితం జ్యూరీ సోషల్ మీడియాల ద్వారా అదే విషయాన్ని ధృవీకరించింది. RRR ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకోలేదు కానీ RRR లో ఆడ్రినలిన్ పంపింగ్ యాక్షన్ దృశ్యాలతో విజువల్ ఫీస్ట్ గా నిలిచింది. ముఖ్యంగా భారతీయ వినోద ప్రియులతో పాటు.. పాశ్చాత్య ప్రేక్షకులను ఈ సినిమా గొప్పగా ఆకర్షించింది. విదేశాల్లోను చక్కని ఆదరణ దక్కించుకుంది. విదేశీ సాంకేతిక నిపుణుల నుంచి రాజమౌళి గొప్ప ప్రశంసలు అందుకున్నారు. కారణం ఏదైనా కానీ ... ఆర్.ఆర్.ఆర్ రూపంలో అతడికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. రాజమౌళికి ప్రతిష్ఠాత్మక పురస్కారాల వేదికపై ఉత్తమ దర్శకుడిగా అవార్డు లభించింది.
దర్శకధీర హాలీవుడ్ కి వెళతారా?బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి క్రేజ్ స్కైని టచ్ చేసింది. అది RRR ఘన విజయంతో పరాకాష్ఠకు చేరుకుంది. ఇప్పుడు అతడు ఒక హాలీవుడ్ సినిమాకి దర్శకత్వం వహించగలిగేంత స్టామినాను కలిగి ఉన్నారు. హాలీవుడ్ తో పోలిస్తే మేకింగ్ టెక్నిక్స్ పరంగా మనం చాలా వెనకబడి ఉన్నామన్నది వాస్తవం. కానీ ఇటీవలి కాలంలో హాలీవుడ్ స్టాండార్డ్స్ ని అందుకుంటున్న ఏకైక దర్శకుడిగా రాజమౌళి సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒక తెలుగు దర్శకుడి నుంచి ఇలాంటి విజయాలను జాతీయ అంతర్జాతీయ మీడియా సైతం ప్రశంసిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడంతో పాశ్చాత్య దేశాల్లోను రాజమౌళి పేరు మార్మోగుతోంది. ఇటీవల ఆర్.ఆర్.ఆర్ ని విదేశీ వెర్షన్లలో రిలీజ్ చేస్తూ రాజమౌళి హాలీవుడ్ మీడియాలోను హల్ చల్ చేస్తుండడంతో అతడి కదలికలపై రకరకాల సందేహాలు అలుముకున్నాయి.
అదే క్రమంలో రాజమౌళి మైండ్ లో హాలీవుడ్ - టాలీవుడ్ టై అప్ పై ఆలోచన మెదలడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. SS రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో హాలీవుడ్ నుండి ఆఫర్ల వెల్లువ గురించి మాట్లాడాడు. అతను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో తన అరంగేట్రంపైనా చిన్నపాటి క్లూ ఇవ్వడంతో ఇది టాలీవుడ్ సర్కిల్స్ లోను హాట్ టాపిక్ గా మారింది. MCU సినిమాల్లో RRR దర్శకుడు SS రాజమౌళి అరంగేట్రం కోసం మార్వెల్ బాస్ కెవిన్ ఫీజ్ సంప్రదించారని కూడా ప్రచారం సాగుతోంది. రాజమౌళి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తన పీరియాడికల్ డ్రామా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.
UKలో BAFTA నామినేషన్ లకు ముందు ఒక రౌండ్ ప్రమోషన్ లలో పాల్గొన్న రాజమౌళిని "హాలీవుడ్ చిత్రాలకు పని చేసేందుకు మీరు సిద్ధమా? మార్వెల్ సినిమాల కోసం సంప్రదింపులు సాగాయా? " అని మీడియా సూటిగానే ప్రశ్నించింది. దానికి ఆయన తనదైన శైలిలో ప్రతిస్పందించారు."హాలీవుడ్ నుండి చాలా ఎంక్వైరీలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను. అతడు పెద్ద తెలుగు స్టార్. తనతో సినిమాకి కమిట్ అయ్యాను" అన్నారు. కానీ హాలీవుడ్ నుండి చాలా నేర్చుకోవాలనుకుంటున్నానని రాజమౌళి స్పష్టం చేసారు. వారి పని తీరు.. వారి పద్దతి తెలుసుకుంటున్నాను. ఒకరికొకరం కలిసిమెలిసి ఎలా సహకరించుకోవచ్చు.. దీనిని ఎలా గొప్ప అనుభవంగా మార్చగలమా లేదా? అన్నది ఆలోచిస్తున్నాను!! అని రాజమౌళి అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.