Begin typing your search above and press return to search.

RRR వివాదం: జక్కన్న అందుకే స్పందించడం లేదా..?

By:  Tupaki Desk   |   3 Nov 2020 11:30 AM GMT
RRR వివాదం: జక్కన్న అందుకే స్పందించడం లేదా..?
X
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోయిన దర్శకధీరుడు రాజమౌళి సినిమా విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలిసిందే. ప్రతీ సన్నివేశం అద్భుతంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ప్రతి షాట్ ని అలా తీర్చిదిద్దుతాడు కాబట్టే అందరూ 'జక్కన్న' అని పిలుస్తూ ఉంటారు. అపజయం ఎరుగని ఫిలిం మేకర్ గా కొనసాగుతున్న రాజమౌళి.. స్టోరీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ప్రేక్షకులను మెప్పించే విధంగా తీయడమే కాకుండా.. వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై వివాదం చోటు చేసుకుంది.

'ఆర్.ఆర్.ఆర్' లో ఎన్టీఆర్ 'కొమురం భీమ్‌' గా.. 'అల్లూరి సీతారామరాజు'గా రామ్‌ చరణ్‌ నటిస్తున్నారు. ఇటీవల కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ 'కొమురం భీమ్' లుక్‌ ని రివీల్ చేస్తూ టీజర్‌ ని విడుదల చేశారు. అయితే ఇందులో తారక్ ని ఓ మతవిశ్వాసాలకు సంబంధించిన టోపీ ధరించినట్లు చూపించడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఆదివాసీల నుంచి ఎంపీల వరకు అందరూ రాజమౌళికి వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. ముస్లిం పాలకులపై పోరాడి వారి చేతిలోనే చంపబడ్డ వీరుడు కొమురం భీమ్ పాత్రను వారి వేషదారణలో చూపించడం తగదని.. భీమ్ కి టోపీ ధరించి ఉన్న సన్నివేశాలని తొలగించాలని.. ఈ సినిమాను అలానే రిలీజ్ చేస్తే బరిశెలతో కొట్టి చంపుతామని..థియేటర్స్ తగల బెడతామని హెచ్చరికలు చేశారు.

అయితే ఈ వివాదంపై రాజమౌళి లేదా 'ఆర్.ఆర్.ఆర్' చిత్ర బృందం ఇంతవరకు స్పందించలేదు. రాజమౌళి మొదటి నుంచి ఇది ఇద్దరు రియల్ లైఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ క్యారెక్టర్స్ తో తీస్తున్న కల్పిత కథ అని చెప్తూ వస్తున్నాడు. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ టోపీ ని తీసేయడం కుదిరేపని కాదని తెలుస్తోంది. అయితే ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో రాజమౌళి ఇండస్ట్రీలోని ప్రముఖులతో పలువురు రాజకీయ నాయకులతో ఈ వివాదంపై చర్చిస్తున్నారట. ఇటువంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలా అనే విషయం గురించి పూర్తిగా డిష్కసన్ చేసిన తర్వాతే ఈ ఇష్యూపై జక్కన్న స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వివాదానికి ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.