Begin typing your search above and press return to search.

రాజమౌళి చేసిన పని వీళ్ళ చావుకొచ్చింది..!

By:  Tupaki Desk   |   8 April 2020 9:30 AM GMT
రాజమౌళి చేసిన పని వీళ్ళ చావుకొచ్చింది..!
X
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. సినిమాల షూటింగులను మొదలుకొని సినిమా విడుదలలు - మూవీ ప్రమోషన్స్.. లాంటివి కూడా ఆగిపోయాయి. సినీ అభిమానులు వారి హీరోల సినిమాల అప్‌ డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకొనివున్న పరిస్థితుల కారణంగా ఈ టైములో ఇలాంటివి చేయకూడదని నిర్ణయించుకొని దర్శకనిర్మాతలు - హీరోలు తమ సినిమాల అప్‌ డేట్స్ కూడా పక్కన పెట్టేసారు. అయితే సినీ అభిమానుల దాహాన్ని తీర్చడానికి అన్నట్లు దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్.' మూవీ అప్డేట్ తో బయటకి వచ్చాడు. లాక్ డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన జనాలను ఉత్సాహపరిచేందుకు ఫస్ట్ ‘ఆర్ ఆర్ ఆర్’ మోక్షన్ పోస్టర్‌ ను విడుదల చేశారు రాజమౌళి అండ్ టీమ్. ఆ వెంటనే హీరో రామ్ చరణ్ పుట్టినరోజు రావడంతో ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో ఓ స్పెషల్ వీడియో విడుదల చేశారు. 'ఆర్ ఆర్ ఆర్' లాంటి ప్రతిష్టాత్మక సినిమా నుంచి ఒకేసారి రెండు అప్‌ డేట్స్ రావడంతో వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే పరిస్థితి అక్కడితో ఆగలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి రెండు అప్‌ డేట్స్ రావడం తో తమ అభిమాన హీరో సినిమా అప్‌ డేట్స్ విడుదల చేయాలంటూ సోషల్ మీడియాలో గోల చేయడం మొదలెట్టారు ఫ్యాన్స్.

ఇప్పుడు రాజమౌళిగారు చేసిన ఈ పనికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మిగతా హీరోలు దర్శకనిర్మాతలు తలలు పట్టుకు కూర్చున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొడవ ఎక్కువ కావడంతో బన్నీ పుట్టినరోజున 'పుష్ప' ఫస్ట్ లుక్ - టైటిల్ అనౌన్స్ మెంట్ చేసేసారు చిత్ర యూనిట్. నిన్న మొన్న స్టార్ట్ అయిన సినిమాలే న్యూ అప్డేట్ ఇస్తుంటే యూవీ క్రియేషన్స్ వారు మాత్రం ప్రభాస్ అప్డేట్ ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో 'బ్యాన్ యూవీ క్రియేషన్స్' అంటూ ట్రెండ్ చేసి తమ నిరసన తెలియజేసారు. దాంతో యూవీ క్రియేషన్స్.. లాక్ డౌన్ సమయంలో అప్‌ డేట్ ఇవ్వమంటే వీలు కాదని - పరిస్థితి కాస్త సద్ధుమణిగిన తర్వాత అప్‌ డేట్స్ ఇస్తామంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి కరోనా గోల లేకపోతే ఉగాదికి ఈ సినిమా టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అయితే కరోనా లాక్ డౌన్ తో ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ మంచిది కాదని నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే అభిమానులు మాత్రం అదేమీ అర్ధం చేసుకునే స్థితిలో లేరు. ఫ్యాన్స్ కి ఎమోషన్స్ తప్ప లాజిక్స్ ఉండవని ఒక సినిమాలో చెప్పినట్టు గా ఫ్యాన్స్ నిర్మాతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇది తగిన సమయం కాదని - సంయమనం పాటించాలని యూవీ వాళ్ళు ట్విట్టర్ ద్వారా విన్నవించుకున్నారు కానీ అక్కడ కూడా ఫ్యాన్స్ తిడుతున్నారు. ప్రభాస్ కల్పించుకొని అభిమానులని సైలెంట్ గా ఉండమని చెప్తే తప్ప వీరు వినేలా లేరు.

ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న మరో హీరో అఖిల్ దాకా వెళ్ళింది. కానీ అఖిల్ ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితులలో ఇలాంటివి కరెక్ట్ కాదని తన ఫ్యాన్స్ కి చెప్పుకొచ్చారు. కానీ హద్దులు మీరుతున్న అభిమానంతో అంతకంతకూ దిగజారుతున్నారు కొందరు వెర్రి అభిమానులు. అయితే లాక్ డౌన్ సమయంలో రాజమౌళి ఇలా అప్‌ డేట్స్ ఇవ్వకుంటే ఫ్యాన్స్ గొడవ చేసేవారు కాదంటూ ఒక టాక్ కూడా వినిపిస్తోంది. ఆయన అప్‌ డేట్స్ ఇవ్వడం వల్లే ఫ్యాన్స్ ఇలా తమ మీద పడుతున్నారని అంటున్నారు. ఈ విధంగా రాజమౌళి మంచికని చేసిన పని - ఆయనికి తెలియకుండానే చెడుకు దారి తీసి వీళ్ళ చావుకొచ్చిందని అనుకుంటున్నారు.