Begin typing your search above and press return to search.
ఆస్కార్ ఏమో కాని.. జక్కన్నకు అలా కలిసి వచ్చింది
By: Tupaki Desk | 29 Dec 2022 8:30 AM GMTటాలీవుడ్ జక్కన్న రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్నాడు. బాహుబలి తర్వాత ఆయన చేయబోతున్న సినిమా అంతకు మించి ఉంటుందని మొదటి నుండి అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆర్ఆర్‌ఆర్ సినిమాను హాలీవుడ్ వారు సైతం మెచ్చే విధంగా తెరకెక్కించి ఏకంగా ఆస్కార్ కోసం ప్రయత్నాలు చేశాడు.
ఆస్కార్ నామినేషన్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన జక్కన్న ఆ ఘనత దక్కించుకున్నా.. దక్కించుకోకున్నా కూడా హాలీవుడ్ లో మాత్రం మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఆస్కార్ నామినేషన్స్ లో ఉంచేందుకు గాను అంతర్జాతీయ మీడియా ముందు పలు సార్లు జక్కన్న మాట్లాడాడు.
అంతే కాకుండా ఆర్‌ఆర్ఆర్ సినిమా యొక్క విజువల్స్ ను కూడా అంతర్జాతీయ మీడియా ప్రధానంగా తమ కథనాల్లో చూపించడం జరిగింది. దాంతో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నుండి మొదలుకుని అంతర్జాతీయ స్థాయి నటీ నటులు మరియు టెక్నీషియన్స్ తో జక్కన్నకు పరిచయం అయ్యింది.
ఇప్పుడు అదే జక్కన్నకు కలిసి వచ్చింది. హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు రెండు మూడు రాజమౌళితో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇండియన్ భాషల్లో అయినా పర్వాలేదు ఇంగ్లీష్ లో అయినా పర్వాలేదు రాజమౌళితో సినిమాలను నిర్మించేందుకు ఆ నిర్మాణం సంస్థలు పోటీ పడుతున్నాయట.
రాజమౌళి తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమా యొక్క నిర్మాణ భాగస్వామిగా హాలీవుడ్ నిర్మాణ సంస్థ వ్యవహరించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మాణం లో భాగస్వామి అంటే సహజంగానే డాలర్లు భారీ గా పెడతారు. అప్పుడు సినిమా రేంజ్ అమాంతం పెరగడం ఖాయం.
మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ దక్కకున్నా కూడా జక్కన్న కు హాలీవుడ్ లో గౌరవం.. గుర్తింపు దక్కడం ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు గర్వించదగ్గ విషయం. రాజమౌళి ముందు ముందు హాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మహేష్ బాబు సినిమా తర్వాత అదే జరగబోతుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.