Begin typing your search above and press return to search.

హాలీవుడ్ కి రాజ‌మౌళి జంప్! MCU తో సంప్రదింపులు!?

By:  Tupaki Desk   |   26 Nov 2022 5:31 AM GMT
హాలీవుడ్ కి రాజ‌మౌళి జంప్! MCU తో సంప్రదింపులు!?
X
బాహుబ‌లి ఫ్రాంఛైజీ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళి క్రేజ్ 'స్కై ఈజ్ లిమిట్' అన్న చందంగా పెరిగింది. అది RRR ఘ‌న‌ విజయంతో ప‌రాకాష్ఠ‌కు చేరుకుంది. ఇప్పుడు అతడు ఒక హాలీవుడ్ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గ‌లిగేంత స్టామినాను క‌లిగి ఉన్నారు. హాలీవుడ్ తో పోలిస్తే మేకింగ్ టెక్నిక్స్ ప‌రంగా మ‌నం చాలా వెన‌క‌బ‌డి ఉన్నామ‌న్న‌ది వాస్త‌వం. కానీ ఇటీవ‌లి కాలంలో హాలీవుడ్ స్టాండార్డ్స్ ని అందుకుంటున్న ఏకైక ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళి సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు. ఒక తెలుగు ద‌ర్శ‌కుడి నుంచి ఇలాంటి విజ‌యాల‌ను జాతీయ అంత‌ర్జాతీయ‌ మీడియా సైతం ప్ర‌శంసిస్తోంది. ఆర్.ఆర్.ఆర్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావ‌డంతో పాశ్చాత్య దేశాల్లోను రాజ‌మౌళి పేరు మార్మోగుతోంది. ఇటీవ‌ల ఆర్.ఆర్.ఆర్ ని విదేశీ వెర్ష‌న్ల‌లో రిలీజ్ చేస్తూ రాజ‌మౌళి హాలీవుడ్ మీడియాలోను హ‌ల్ చ‌ల్ చేస్తున్నాడు.

అదే క్ర‌మంలో రాజ‌మౌళి మైండ్ లో హాలీవుడ్ - టాలీవుడ్ టై అప్ పై ఆలోచ‌న మెద‌ల‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. SS రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో హాలీవుడ్ నుండి ఆఫర్ల వెల్లువ గురించి మాట్లాడాడు. అతను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో తన అరంగేట్రంపైనా చిన్న‌పాటి క్లూ ఇవ్వ‌డంతో ఇది టాలీవుడ్ స‌ర్కిల్స్ లోను హాట్ టాపిక్ గా మారింది.

MCU సినిమాల్లో RRR దర్శకుడు SS రాజమౌళి అరంగేట్రం కోసం మార్వెల్ బాస్ కెవిన్ ఫీజ్ సంప్రదించార‌ని కూడా ప్ర‌చారం సాగుతోంది. రాజ‌మౌళి ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తన పీరియాడికల్ డ్రామా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. UKలో BAFTA నామినేషన్ లకు ముందు ఒక రౌండ్ ప్రమోషన్ లలో పాల్గొన్న రాజమౌళిని ''హాలీవుడ్ చిత్రాల‌కు ప‌ని చేసేందుకు మీరు సిద్ధ‌మా? మార్వెల్ సినిమాల కోసం సంప్రదింపులు సాగాయా? '' అని మీడియా సూటిగానే ప్ర‌శ్నించింది. దానికి ఆయ‌న త‌న‌దైన శైలిలో ప్ర‌తిస్పందించారు.

మార్వెల్ సినిమా కోసం కెవిన్ ఫీజ్ మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? అని ఎస్‌.ఎస్ రాజమౌళిని ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూవ‌ర్ అడిగారు. దానికి బదులిస్తూ...''హాలీవుడ్ నుండి చాలా ఎంక్వైరీలు వ‌స్తున్నాయి. కానీ ప్రస్తుతం టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను.

అతడు పెద్ద తెలుగు స్టార్. త‌న‌తో సినిమాకి కమిట్ అయ్యాను'' అన్నారు. కానీ హాలీవుడ్ నుండి చాలా నేర్చుకోవాలనుకుంటున్నానని రాజ‌మౌళి స్ప‌ష్టం చేసారు. వారి పని తీరు.. వారి పద్దతి తెలుసుకుంటున్నాను. ఒక‌రికొక‌రం క‌లిసిమెలిసి ఎలా సహకరించుకోవచ్చు.. దీనిని ఎలా గొప్ప అనుభవంగా మార్చగలమా లేదా? అన్న‌ది ఆలోచిస్తున్నాను!! అని రాజ‌మౌళి అన్నారు.

నిజానికి RRR పై వ‌ర‌ల్డ్ వైడ్ ఉన్న హైప్ చూసి ఆశ్చర్యపోయానని రాజ‌మౌళి తాజా ఇంట‌ర్వ్యూలో విస్మ‌యం చెందారు. ప్ర‌ఖ్యాత‌ ఎంపైర్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ-''ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రవాస భార‌తీయులు ఉన్నారు. భారతీయ ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ చిత్రం వారికి న‌చ్చుతుంద‌ని మాత్ర‌మే నేను అనుకున్నాను. అయితే పాశ్చాత్యుల నుంచి ఆదరణ మొదలైంది. నేను ఇదేమీ ఊహించలేదు'' అని అన్నారు. అలాగే తన సినిమా విజయంలో కోవిడ్-19 పాత్ర కూడా ఉండి ఉండొచ్చని భావిస్తున్న‌ట్టు క్రిప్టిక్ గా మాట్లాడారు.

ఇంతకుముందు బ్రేవ్ హార్ట్ .. బెన్-హర్ వంటి హాలీవుడ్ చిత్రాలపై రాజ‌మౌళి తన ప్రేమను ఆస‌క్తిని వ్యక్తం చేశాడు. ఏదో ఒక రోజు 'ప్రిన్స్ ఆఫ్ పర్షియా' ఫిల్మ్ అడాప్టేషన్ ని ప్రయత్నిస్తానని కూడా చెప్పాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో తెర‌కెక్కించే సినిమా హాలీవుడ్ సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రం 'ఇండియానా జోన్స్' త‌ర‌హాలో అత్యంత భారీగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉంటుంద‌న్న ప్ర‌చారం కూడా సాగుతోంది. బ‌హుశా మ‌హేష్ సినిమాతోనే అత‌డు స‌రికొత్త ప్ర‌య‌త్నం చేస్తున్నారా? హాలీవుడ్ తో (మార్వ‌ల్ కి) భార‌తీయ సినిమాకి వార‌ధిని నిర్మించే ప్ర‌యత్నాన్ని రాజ‌మౌళి చేస్తున్నారా?.. అంటే ..అవున‌నే భావిద్దాం. 'తుపాకి' డాట్ కాం ఇది నిజం కావాల‌ని కూడా ఆశిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.