Begin typing your search above and press return to search.
వీడియో : ఆనందంలో పెద్దన్న జక్కన్న నాటు నాటు స్టెప్
By: Tupaki Desk | 12 Jan 2023 9:05 AM GMTఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్న కీరవాణి యావత్ దేశ సినీ ప్రేమికులు గర్వించే విధంగా చేశారు. సామాన్య ప్రేక్షకుల నుండి మొదలుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ వరకు కీరవాణి కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు.
అవార్డ్ అందుకున్న తర్వాత రాజమౌళి మరియు కీరవాణి తెగ సందడి చేశారు. అవార్డు పట్టుకుని వచ్చిన కీరవాణికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు. భారీ ఎత్తున సెలబ్రేషన్స్ జరిగాయి. రాజమౌళితో పాటు కీరవాణి నాటు నాటు స్టెప్ వేయడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా మేకర్.. ఆ సినిమాలో అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన కీరవాణి కలిసి నాటు నాటు స్టెప్ వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. పెద్దన్న కీరవాణి మరియు జక్కన్న రాజమౌళి ల యొక్క బాండింగ్ ముందు ముందు మరిన్ని సినిమాలకు అవార్డులను తెచ్చి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రాజమౌళి కెరీర్ ఆరంభం నుండి కూడా తన ప్రతి సినిమాకు కూడా పెద్దన్న కీరవాణితో వర్క్ చేస్తూ వచ్చాడు. ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ తో ప్రతి సినిమాకు కూడా అద్భుతమైన మ్యూజిక్ వచ్చింది. అందుకే కీరవాణి సంగీతం కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో తెలుగు సినీ ప్రేక్షకులు నాటు నాటు స్టెప్ ను మరింత ఊర మాస్ గా వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.